అధిక వర్షాలతో దెబ్బతిన్న జనగాంమర్రి, మాందాపూర్ రోడ్ పునరుద్ధరణ
కామారెడ్డి :

జనగాంమర్రి నుండి మామ్ధాపూర్ వరకు ఆర్ అండ్ బి రహదారి ఇటీవల కురిసిన అతి భారీ వర్షాల కారణంగా దెబ్బతింది. రహదారి పైభాగం కొట్టుకుపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈ పరిస్థితిని గమనించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ ఎస్‌డిఆర్‌ఎఫ్/ఎన్‌డిఆర్‌ఎఫ్ నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో రహదారి మరమ్మతు పనులు వేగంగా కొనసాగుతున్నాయి.రాబోయే రోజుల్లో రహదారిని పూర్తిగా పునరుద్ధరించి రాకపోకలకు అనుకూలంగా మార్చే చర్యలను ఆర్ అండ్ బి అధికారులు చేపడుతున్నారు.
