ప్రజలందర్ని చల్లంగా చూడు తల్లి.!
దుమ్ముగూడెం, ఫిబ్రవరి 04 (భారతశక్తి): మండల కేంద్రంలోని జరుగుతున్న ముత్యాలమ్మ జాతరకు తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, భద్రాచలం మాజీ శాసనసభ్యులు పొదెం వీరయ్య అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం ముత్యాలమ్మ జాతరకు వచ్చిన పొందేం వీరయ్య కు ఆలయ కమిటీ సభ్యులు భాజా భజంత్రీలతో సాదరంగా ఘన స్వాగతం పలికారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా పొందేం వీరయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రజాలందర్ని చల్లంగా చూడాలని, పాడి పంటలు సమృద్ధిగా వృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకున్నారు. తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, భద్రాచలం నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో, అష్టఐశ్వర్యాలతో విరాజిల్లాలని ఈ సందర్భంగా అమ్మవారిని వేడుకొని మొక్కులు చెల్లించుకున్నారు. రెండేళ్లకు ఒకసారి నిర్వహించే ముత్యాలమ్మ జాతర విజయవంతంగా నిర్వహించడం పట్ల కమిటివారిని జాతర నిర్వాహకులను గ్రామస్తులను అభినందించారు.