ఎమ్మెల్సీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి: జిల్లా రెవెన్యూ అధికారిణి పద్మశ్రీ
ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ ), పిబ్రవరి 12: జిల్లాలో నిర్వహించు ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ అన్నారు. ఈ నెల 27న జిల్లాలో నిర్వహించనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో బుధవారం ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ నిర్వహణపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారిణి మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ప్రతి ఒక్కరికి అనుభవం ఉందని, ఎక్కడా తేలికగా తీసుకోకుండా ఎన్నికల విధులను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. ఖమ్మం జిల్లాలో 4089 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారని, వీరి కోసం 24 పోలింగ్ కేంద్రాలను సిద్దం చేశామని, నిబంధనలు పాటిస్తూ పోలింగ్ సజావుగా జరపాలని అన్నారు. నామినేషన్లు ఉపసంహరణ గడువు ఫిబ్రవరి 13న ముగుస్తుందని, పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు గురువారం వరకు తెలుస్తాయని అన్నారు. ఎన్నికల విధుల పట్ల ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని, శిక్షణా కార్యక్రమాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అంతకుముందు మాస్టర్ ట్రైనర్ లు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజేశ్వరి, జిల్లా ఉపాధికల్పన అధికారిణి మాధవి లు పోలింగ్ నిర్వహణపై వివరిస్తూ, ఫిబ్రవరి 27న ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు శాసనమండలి ఎన్నికల పోలింగ్ జరుగనున్నదని, ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియపై సిబ్బంది అవగాహన కల్పించుకోవాలని, ప్రిఫరెన్షియల్ ఓటింగ్ విధానంతో ఎన్నికలు జరుగుతాయని అన్నారు. బ్యాలెట్ బాక్స్ లను ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, సీల్ చేసే పద్ధతులపై అవగాహనతో ఉండాలని అన్నారు. ఫిబ్రవరి 26న డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి వచ్చి పోలింగ్ డ్యూటీ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని సంబంధిత పోలింగ్ కేంద్రం సిబ్బందితో కలిసి పోలింగ్ సామాగ్రి తీసుకోవాలని అన్నారు. అవసరమైన మేర సరైన బ్యాలెట్ పత్రాలు, ఓటరు జాబితా, ఇతర ముఖ్యమైన పోలింగ్ సామాగ్రి చెక్ లిస్ట్ తయారు చేసుకొని అన్ని అందుబాటులో ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు లైన్లో వచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని, ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్ ను గుర్తించి, జాబితాలో అతని పేరు చెక్ చేసుకోవాలని, ఎడమచేతి చూపుడు వేలుకి ఇంక్ పెట్టాలని అన్నారు. పోలింగ్ లో ఓటు వేసేందుకు గుర్తింపు పొందిన ఐడిని ఓటర్లు తమ వెంట తీసుకుని రావాల్సి ఉంటుందని అన్నారు. ఓటర్ గుర్తింపు జరిగిన తర్వాత పోలింగ్ కేంద్రంలో ఉన్న రెండవ అధికారి ఓటరు వివరాలను నమోదు చేసుకొని, ఓటర్ సంతకం తీసుకొని బ్యాలెట్ పేపర్ జారీ చేయాలని, సంతకం చేయని పక్షంలో బ్యాలెట్ పేపర్ జారీ చేయవద్దని అన్నారు. బ్యాలెట్ పేపర్, వాయిలెట్ స్కెచ్ పెన్ తో సహా ఓటర్ కు అందిస్తూ అవసరమైతే ఓటింగ్ విధానాన్ని తెలియజేయాలని, ఓటింగ్ కంపార్ట్మెంట్ లో ఓటు వేసి, బ్యాలెట్ పేపర్ ను మడిచి బ్యాలెట్ బాక్స్ లో వేయాల్సి ఉంటుందని, ఈ ప్రక్రియ సజావుగా జరిగేలా పర్యవేక్షించాలని అన్నారు. పోలింగ్ నాడు ఉదయం 7-30 గంటలకు ఖాళీగా ఉన్న బ్యాలెట్ బాక్స్ ను ఏజెంట్లకు చూపించాలని, గ్రీన్ పేపర్ లో ఏజెంట్ల సంతకాలు తీసుకుని సీల్ చేయాలని, బ్యాలెట్ బాక్స్ పై పోలింగ్ కేంద్రం వివరాలు ఉండే విధంగా పేపర్ అతికించాలని, ఓటర్ సీక్రేసి కాపాడేందుకు వీలుగా ఓటింగ్ కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేయాలని అన్నారు. పోలింగ్ నాడు ప్రతి రెండు గంటలకు ఒకసారి అంటే ఉదయం 10.00, మధ్యాహ్నం 12.00, 2.00 గంటలకు, పోలింగ్ ముగిసిన తరువాత 4.00 గంటలకు పోలింగ్ జరిగిన వివరాల రిపోర్ట్ పంపాలని అన్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటర్ స్లిప్పులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఓటు వేసే అవకాశం కల్పించాలని అన్నారు. చివరి ఓటర్ ఓటు వినియోగించుకున్న తర్వాత నిబంధనల ప్రకారం బ్యాలెట్ బాక్సులను మూసివేసి సీల్ చేయాలని, ప్రతి ఒక్క సిబ్బంది తన మాన్యువల్ ను ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలని , విధులను పక్కాగా నిర్వహిస్తూ ప్రశాంతంగా ఓటింగ్ జరిగేలా చూడాలని అన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు స్వామి, కలెక్టరేట్ ఎన్నికల డిటి అన్సారీ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం ప్రతినిది (భారత శక్తి న్యూస్ ), పిబ్రవరి 12:
జిల్లాలో నిర్వహించు ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారిణి ఏ. పద్మశ్రీ అన్నారు.
ఈ నెల 27న జిల్లాలో నిర్వహించనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో బుధవారం ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులకు పోలింగ్ నిర్వహణపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
నామినేషన్లు ఉపసంహరణ గడువు ఫిబ్రవరి 13న ముగుస్తుందని, పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు గురువారం వరకు తెలుస్తాయని అన్నారు. ఎన్నికల విధుల పట్ల ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలని, శిక్షణా కార్యక్రమాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
బ్యాలెట్ బాక్స్ లను ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, సీల్ చేసే పద్ధతులపై అవగాహనతో ఉండాలని అన్నారు. ఫిబ్రవరి 26న డిస్ట్రిబ్యూషన్ కేంద్రానికి వచ్చి పోలింగ్ డ్యూటీ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకొని సంబంధిత పోలింగ్ కేంద్రం సిబ్బందితో కలిసి పోలింగ్ సామాగ్రి తీసుకోవాలని అన్నారు. అవసరమైన మేర సరైన బ్యాలెట్ పత్రాలు, ఓటరు జాబితా, ఇతర ముఖ్యమైన పోలింగ్ సామాగ్రి చెక్ లిస్ట్ తయారు చేసుకొని అన్ని అందుబాటులో ఉన్నాయో లేదో ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని అన్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు లైన్లో వచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని, ఓటు వేసేందుకు వచ్చిన ఓటర్ ను గుర్తించి, జాబితాలో అతని పేరు చెక్ చేసుకోవాలని, ఎడమచేతి చూపుడు వేలుకి ఇంక్ పెట్టాలని అన్నారు. పోలింగ్ లో ఓటు వేసేందుకు గుర్తింపు పొందిన ఐడిని ఓటర్లు తమ వెంట తీసుకుని రావాల్సి ఉంటుందని అన్నారు.
ఓటర్ గుర్తింపు జరిగిన తర్వాత పోలింగ్ కేంద్రంలో ఉన్న రెండవ అధికారి ఓటరు వివరాలను నమోదు చేసుకొని, ఓటర్ సంతకం తీసుకొని బ్యాలెట్ పేపర్ జారీ చేయాలని, సంతకం చేయని పక్షంలో బ్యాలెట్ పేపర్ జారీ చేయవద్దని అన్నారు. బ్యాలెట్ పేపర్, వాయిలెట్ స్కెచ్ పెన్ తో సహా ఓటర్ కు అందిస్తూ అవసరమైతే ఓటింగ్ విధానాన్ని తెలియజేయాలని, ఓటింగ్ కంపార్ట్మెంట్ లో ఓటు వేసి, బ్యాలెట్ పేపర్ ను మడిచి బ్యాలెట్ బాక్స్ లో వేయాల్సి ఉంటుందని, ఈ ప్రక్రియ సజావుగా జరిగేలా పర్యవేక్షించాలని అన్నారు.
పోలింగ్ నాడు ఉదయం 7-30 గంటలకు ఖాళీగా ఉన్న బ్యాలెట్ బాక్స్ ను ఏజెంట్లకు చూపించాలని, గ్రీన్ పేపర్ లో ఏజెంట్ల సంతకాలు తీసుకుని సీల్ చేయాలని, బ్యాలెట్ బాక్స్ పై పోలింగ్ కేంద్రం వివరాలు ఉండే విధంగా పేపర్ అతికించాలని, ఓటర్ సీక్రేసి కాపాడేందుకు వీలుగా ఓటింగ్ కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేయాలని అన్నారు.
పోలింగ్ నాడు ప్రతి రెండు గంటలకు ఒకసారి అంటే ఉదయం 10.00, మధ్యాహ్నం 12.00, 2.00 గంటలకు, పోలింగ్ ముగిసిన తరువాత 4.00 గంటలకు పోలింగ్ జరిగిన వివరాల రిపోర్ట్ పంపాలని అన్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటర్ స్లిప్పులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఓటు వేసే అవకాశం కల్పించాలని అన్నారు.
చివరి ఓటర్ ఓటు వినియోగించుకున్న తర్వాత నిబంధనల ప్రకారం బ్యాలెట్ బాక్సులను మూసివేసి సీల్ చేయాలని, ప్రతి ఒక్క సిబ్బంది తన మాన్యువల్ ను ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోవాలని , విధులను పక్కాగా నిర్వహిస్తూ ప్రశాంతంగా ఓటింగ్ జరిగేలా చూడాలని అన్నారు.
ఈ శిక్షణా కార్యక్రమంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు స్వామి, కలెక్టరేట్ ఎన్నికల డిటి అన్సారీ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
