రెండో రోజు ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు దాఖలు, నామినేషన్లు స్వీకరించిన జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి పమేలా సత్పతి
కరీంనగర్, ఫిబ్రవరి 4(భారత శక్తి): మెదక్, నిజామాబాద్, కరీంనగర్, అదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మంగళవారం మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయి. గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లను జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి కి కలెక్టరేట్ లోని ఆమె ఛాంబర్ లో దాఖలు చేశారు. ఇందులో గ్రాడ్యుయేట్ స్థానానికి ఇద్దరు, టీచర్ స్థానానికి ఒక్కరు నామినేషన్లు వేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తీగల ధర్మారం గ్రామానికి చెందిన వేముల కరుణాకర్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వెంకటేశ్వర పల్లి గ్రామానికి చెందిన పిడిశెట్టి రాజు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానానికి మంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణానికి చెందిన ఇన్నారెడ్డి తిరుమల్ రెడ్డి నామినేషన్ వేశారు. 4వ తేది నాటికి మొత్తం 8 మంది గ్రాడ్యుయేట్ స్థానానికి, నలుగురు టీచర్ స్థానానికి నామినేషన్ వేశారని ఎన్నికల అధికారి తెలియజేశారు. గ్రాడ్యుయేట్, టీచర్ స్థానాలకు కలిపి మొత్తం 12 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో పాటు, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, పవన్ కుమార్ ఆర్డిఓ కే.మహేశ్వర్, తహసిల్దార్లు పాల్గొన్నారు.
కరీంనగర్, ఫిబ్రవరి 4(భారత శక్తి):
మెదక్, నిజామాబాద్, కరీంనగర్, అదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మంగళవారం మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయి. గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లను జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి కి కలెక్టరేట్ లోని ఆమె ఛాంబర్ లో దాఖలు చేశారు. ఇందులో గ్రాడ్యుయేట్ స్థానానికి ఇద్దరు, టీచర్ స్థానానికి ఒక్కరు నామినేషన్లు వేశారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తీగల ధర్మారం గ్రామానికి చెందిన వేముల కరుణాకర్ రెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు.
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం వెంకటేశ్వర పల్లి గ్రామానికి చెందిన పిడిశెట్టి రాజు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు.
ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానానికి మంచిర్యాల జిల్లా మంచిర్యాల పట్టణానికి చెందిన ఇన్నారెడ్డి తిరుమల్ రెడ్డి నామినేషన్ వేశారు.
4వ తేది నాటికి మొత్తం 8 మంది గ్రాడ్యుయేట్ స్థానానికి, నలుగురు టీచర్ స్థానానికి నామినేషన్ వేశారని ఎన్నికల అధికారి తెలియజేశారు. గ్రాడ్యుయేట్, టీచర్ స్థానాలకు కలిపి మొత్తం 12 మంది అభ్యర్థులు 16 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతితో పాటు, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, పవన్ కుమార్ ఆర్డిఓ కే.మహేశ్వర్, తహసిల్దార్లు పాల్గొన్నారు.
