ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలి..

అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

WhatsApp Image 2025-08-07 at 6.55.03 PM
కామారెడ్డి పట్టణంలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలని  జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. 

గురువారం జిల్లా కలెక్టర్ కామారెడ్డి పట్టణంలోని  రాజా నగర్ కాలనీలో  పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ  ప్రగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా బేస్ మెట్ వరకు నిర్మాణం పూర్తయినదానికి  బిల్లులు మంజూరు అయ్యాయా? ఇందిరమ్మ  ఇంటి నిర్మాణానికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని లబ్ధిదారును అడిగి  ఎలాంటి సమస్య రాకుండా ప్రభుత్వం ఉచితంగా ఇసుక, మొరం  అందజేస్తుందని రవాణా ఖర్చులు పెట్టుకొని వాటిని తీసుకుని వచ్చి  నాణ్యతగా ఇల్లు నిర్మించుకోవాలని అన్నారు. నిర్మాణం పూర్తయిన ఇంటి వివిధ స్టేజీలను బట్టి  బిల్లులు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఇందిరమ్మ లబ్ధిదారులకు  ఇసుక, మొరం, ఇతర నిర్మాణ సాగుమాగ్రికి ఎలాంటి సమస్య తలెత్తకుండా  రెగ్యులర్గా పర్యవేక్షించాలని  హౌసింగ్ పీడీ  విజయ్ పాల్ రెడ్డి, కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి లను ఆదేశించారు. మార్కౌట్ చేసి నిర్మాణం ప్రారంభమైన  అన్ని ఇందిరమ్మ ఇంట్లో వేగంగా నిర్మాణం పూర్తయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.. 

Read More జాతికి సవాలు విసురుతున్న బాలకార్మిక వ్యవస్థ..

About The Author