విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి చూపాలి
ఖమ్మం :
ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలేటి పరంజ్యోతి
ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం
విద్యార్థులు, యువత క్రీడల పట్ల ఆసక్తి చూపాలని నేలకొండపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలేటి పరంజ్యోతి అన్నారు. శుక్రవారం కళాశాలలో మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ‘జాతీయ క్రీడా దినోత్సవం’ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ...2012లో భారత ప్రభుత్వం ధ్యాన్‌చంద్ భారతీయ క్రీడలకు చేసిన సేవలను గుర్తించి ఆయన పుట్టినరోజును ‘జాతీయ క్రీడా దినోత్సవం’గా ప్రకటించిందన్నారు. దీని ప్రధాన ఉద్దేశ్యం గ్రామీణస్థాయి క్రీడాకారులను వెలుగులోకి తీసుకురావడం, వారిని ప్రోత్సహించడం, వారిలో అవగాహన పెంచడం, మెరుగైన సౌకర్యాలు కల్పించడం, క్రీడా సంస్కృతిని నిర్మించడం, సామాన్య ప్రజానీకంలో క్రీడలపై అవగాహన పెంచడం జాతీయ క్రీడా దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ప్రతి ఒక్కరినీ క్రీడల్లో నిమగ్నం చేయడం ద్వారా ఆరోగ్యకరమైన భారత దేశాన్ని నిర్మించవచ్చు అన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు పరిమితం కాకుండా శారీరక దృఢత్వం కోసం ఆటలు ఆడాలని,కళాశాలకు విశాలమైన క్రీడా మైదానం ఉన్నదని విద్యార్థులు దీనిని ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వ్యాయామ అధ్యాపకులు&అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్. శ్రీనివాసరావు వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ బి.వెంకటేశ్వర్ రెడ్డి ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ ఎస్.రమేష్, డాక్టర్ ఎస్.నారాయణస్వామి, ఎన్.వెంకన్న ఇతర అధ్యాపక బృందం, అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.