పాత పెన్షన్ ను పునరుద్దరించాలి
ఉమ్మడి వరంగల్ బ్యూరో:
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రెటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు ఆదేశానుసారం గురువారం హన్మకొండ టీజీవో భవన్ లో టీజీఇ జేఏసీ సమావేశంలో సెప్టెంబర్ ఒకటో తేదీన నిర్వహించ తలపెట్టిన పాత పెన్షన్ పునరుద్ధరణ గోడ పత్రికను ఆవిష్కరించారు. హన్మకొండ జిల్లా జేఏసీ చైర్మన్, సభాధ్యక్షులు ఆకుల రాజేందర్ , జేఏసీ చైర్మన్ టీ.జీ.ఓ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నమనేని జగన్మోహన్ రావు , జిల్లా కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కుమార్ , రాష్ట్ర కార్యదర్శి కిరణ్ కుమార్ గౌడ్, జిల్లా కోశాధికారి రాజేష్ కుమార్, ఇతర శాఖల నుండి విచ్చేసిన సంఘ బాధ్యులు, రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘ సభ్యులు, ట్రెస్సా నుండి విచ్చేసిన రాజ్ కుమార్ , రియాజ్ సమక్షంలో రాష్ట్ర జేఏసీ నిరసన కార్యక్రమాలను నిర్వహించుటకు ప్రణాళికను ప్రకటించినారు. ఈ నిరసన కార్యక్రమంలో సెప్టెంబర్ ఒకటవ తేదీన పాత పెన్షన్ సదస్సు ఏర్పాటు చేయుట కొరకై ప్రతి జిల్లాలో ఉదయం నిరసన కార్యక్రమాలు చేపట్టి తర్వాత హైదరాబాద్ లో సదస్సు లో పాల్గొనాలి సెప్టెంబర్ 8వ తేదీన ఉద్యోగులను ఉత్తేజపరచడానికి బస్సు యాత్ర రాష్ట్ర జేఏసీ పక్షాన విచ్చేసి జిల్లాలోని పలు ఉద్యోగులకు ఉద్యోగుల సమస్యల గురించి వివరించి ఉద్యోగుల సమస్యలను నెరవేర్చుకునే దిశగా నిరసన కార్యక్రమాలను చేపట్టుటకు ప్రిపరేటరీ మీటింగ్ పెట్టుకున్నారు.