ఏరియా హాస్పిటల్ లో అరుదైన చికిత్స

మణుగూరు : 

WhatsApp Image 2025-08-28 at 6.29.58 PM

ఏజెన్సీ ప్రాంతంలోని ఏరియా హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్సలు విజయవంతం చేస్తున్నారు. గురువారం పట్టణంలోని శేషగిరినగర్ కు చెందిన  శ్రీనివాస్ (40) తీవ్రమైన ఛాతీ నొప్పి, బిగుతు, అధిక చెమటలు, వాంతులతో ఏరియా హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. డాక్టర్ మార్త సాయి మోహన్ యాదవ్, ఎండి (పిజిషియన్), నర్స్ ఉమా తో కలిసి అత్యవసరంగా టెనెక్టెప్లేస్ తో థ్రాంబోలైసిస్ చికిత్స అందించి విజయవంతం చేశారు. (అక్యూట్ మయోకార్డియల్ ఇన్‌ఫార్క్షన్ -ఎమ్ఐ) లక్షణాలుగా గుర్తించి అత్యవసర సమయంలో అరుదైన శస్త్ర చికిత్స చారిత్రాత్మకంగా ముందడుగు వేయడం పలువురు ప్రశంసించారు. ఛాతీ నొప్పి వంటి సమస్యలను కూడా ఏజెన్సీలోని ఏరియా హాస్పిటల్ లో వైద్య నిపుణులు ఉండడం మాకు చాలా సంతోషంగా ఉందని రోగి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 

Read More మణుగూరులో మొదలైన పనుల జాతర

About The Author