కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన..
కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ..
కామారెడ్డి :
కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ (సీతక్క) పరిశీలించారు. ఈ పర్యటనలో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పాల్గొన్నారు.
వరద ముంపులో చిక్కుకున్న చాలామందిని రక్షించామని
సీఎం, వర్షాలు వరదల మీద వరుస సమీక్షలు నిర్వహిస్తూ మంత్రులను, అధికార యంత్రాంగాన్ని గైడ్ చేస్తున్నారన్నారు. అర్ధరాత్రి అకస్మాత్తుగా క్లౌడ్ బరస్ట్ జరగటం వల్ల వరద ఉధృతి పెరిగిందని, వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని అంచనావేస్తున్నామని బాధితులు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని ప్రభుత్వం తప్పకుండా ఆదుకుంటుందన్నారు. ప్రభుత్వం వరద బాధితులకు స్థానిక అధికారుల ద్వారా ఆహారాన్ని సరఫరా చేస్తున్నామని, ప్రకృతి విపత్తుల సమయంలో రాజకీయాలు చేయకుండా ఎవరికి తోచినట్టుగా వారు బాధితులకు అండగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు దయచేసి పునరావాస కేంద్రాల్లోకి వెళ్లాలని కోరారు. ఎలాంటి విపత్కాల పరిస్థితులు తలెత్తిన ఎదుర్కునేందుకు ప్రభుత్వ యంత్రాంగమంతా సిద్ధంగా ఉందన్నారు.