కామారెడ్డి జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి..

రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, తెలంగాణా వైద్య విధాన పరిషత్ కమిషనర్ లు

కామారెడ్డి : 

WhatsApp Image 2025-08-28 at 5.29.45 PM

కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాల కారణంగా ఏర్పడిన అత్యవసర పరిస్థితులు, ఆరోగ్య శాఖ సంసిద్ధత  ఏర్పాట్లను సమీక్షించడానికి గురువారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు డా. రవీందర్ నాయక్, తెలంగాణా వైద్య విధాన పరిషత్ కమిషనర్ డా. అజయ్ కుమార్ కామారెడ్డి లో పర్యటించారు. ఇట్టి పర్యటనలో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గల అత్యవసర వైద్య సేవల సదుపాయాల గురించి ఆరా తీశారు. అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి, ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు.

Read More పాత పెన్షన్ ను పునరుద్దరించాలి

ఆరోగ్య శాఖ మంత్రి ఆదేశాల మేరకు ప్రతి మండల స్ధాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయిలో గ్రామాల వారీగా ప్రత్యేక వైద్య ఆరోగ్య శిబిరాలు ప్రతి రోజు నిర్వహించాలి, ఇట్టి ఆరోగ్య శిబిరాల నివేదికలు రోజు వారీగా ఉన్నతాధికారులకు సమర్పించాలని సూచించారు.
హౌసింగ్ బోర్డు కాలనీ ,  సత్య  గార్డెన్ లో ఏర్పాటు చేసిన  పునరావాస కేంద్రంలో  ఆరోగ్య శాఖ తరపున ఏర్పాటు చేసిన వైద్యశిబిరాన్ని సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దేవునిపల్లిని సందర్శించి  పరిశీలించి మందుల కొరత ఇతర మౌలిక అవసరాల కొరత లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. కామారెడ్డి జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి  అని ఆదేశించారు.

Read More మణుగూరులో మొదలైన పనుల జాతర

అధిక వర్షాల వల్ల ఏర్పడే సమస్యల వలన జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ తరపున ఏర్పాటు చేసిన అత్యవసర సేవలు, ఇతర ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.చంద్రశేఖర్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 

Read More వేములవాడ పార్థసారథి నర్సింగ్ హోమ్ లో అరుదైన శస్త్రచికిత్స

About The Author