భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) ఖమ్మం జిల్లా మహాసభలను జయప్రదం చేయండి.
జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మా ముత్తరావు
ఖమ్మం :

ఈ సందర్భంగా గుమ్మా ముత్తరావు మాట్లాడుతూ..... నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగాల అవకాశాలను కల్పించకపోవడం ఫలితంగా యువత అంత ఫెడధోరణులు పడుతుందని చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారు.సమాజంలో రోజురోజుకు గంజాయి, మద్యపానం వాడకం పెరిగిపోయిందని వాటి నిర్మూలనకై యువతను చైతన్యం చేస్తూ డి.వై.ఎఫ్.ఐ నిరంతరం కృషి చేస్తుందని వారు తెలిపారు. జిల్లా మహాసభలలో నేడు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున యువజన, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా తీర్మానాలు చేసి భవిష్యత్ కార్యాచరణ పోరాటాలకు సిద్ధం అయ్యేందుకు జారుతున్నాయని, ఈ మహాసభలను యువతి, యువకులు, విద్యార్దులు, ప్రజలు హాజరై జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రోహిత్, నరేష్, బంక శ్రీను, అరవింద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
15 Nov 2025
