ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ప్రత్యేక చొరవ..

మంత్రి సీతక్క, షబ్బీర్ ఆలీ పంపిన నివేదిక ఆధారంగా నిధులు మంజూరు

కామారెడ్డి : 

WhatsApp Image 2025-09-01 at 6.15.24 PM

కామారెడ్డి పట్టణంలోని జి.ఆర్. కాలనీలో 45 కుటుంబాలకు కౌండిన్య కాలనీలో 22 కుటుంబాలకు మొత్తం 67 ఇండ్ల మరమ్మతుకు ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వం తరఫున 11,500 వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని తెలిపారు.

Read More రాజన్న ఆలయంలో అభివృద్ధి పనుల పర్యవేక్షణ

ఇదే కాకుండా కామారెడ్డి పట్టణంలో పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు తక్షణ సహాయం కింద 67 కుటుంబాలకు 4000 రూపాయల చొప్పున వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. కామారెడ్డి నియోజకవర్గంలోని గ్రామాల్లో దాదాపు 60 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి వారికి కూడా 4000 చొప్పున వారి ఖాతాలో జమ చేయడం జరుగుతుంది.

Read More కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు మీడియా సమావేశం

అలాగే ప్రభుత్వ శాసనమండలి కమిటీ, ప్రభుత్వ అధికారులు సర్వే చేసి పూర్తి వివరాలు పంపించిన తర్వాత నష్టపోయిన కుటుంబాలకు పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందించి వారి కుటుంబాలను ఆదుకుంటామని షబ్బీర్ అలీ  పేర్కొన్నారు.

Read More భైంసా పట్టణంలో వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన

About The Author