నిరక్షరాస్య మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలి

ప్రధానోపాధ్యాయులు డాక్టర్. షేక్ మీరా హుస్సేన్

మణుగూరు : 

WhatsApp Image 2025-08-28 at 5.56.00 PM

మహిళా సంఘాల్లో ఉన్న నిరక్షరాస్య మహిళలను, అక్షరాస్యులుగా మార్చడమే ఉల్లాస్ ప్రధాన లక్ష్యమని కూనవరం ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్. షేక్ మీరా హుస్సేన్ అన్నారు. గురువారం మండలంలోని కూనవరం గ్రామ పంచాయితీ కార్యాలయంలో వాలంటరీ టీచర్లకు, వివోఏలు, డ్వాక్రా సంఘాల మహిళలను శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక సాధికారత కోసం అందరికీ చదవడం రాయడం నేర్పించడంలో ప్రతి పౌరుడు భాగస్వామ్యం కావాలని, ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్ లాంగ్ లర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) తెలిపారు. ఈ ఉల్లాస్ కార్యక్రమాన్ని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో విద్యాశాఖ మరియు సెర్ప్ ఉమ్మడి భాగస్వామ్యంతో నిర్వహిస్తున్నారని తెలియజేశారు. ముఖ్యంగా మహిళా సంఘాల్లో ఉన్న నిరక్షరాస్య మహిళలను, అక్షరాస్యులుగా మార్చడమే "ఉల్లాస్" ప్రధాన లక్ష్యమన్నారు. చదవడం రాయడం ద్వారా మహిళల్లో బ్యాంకింగ్ రంగంలో ఆర్థిక క్రమశిక్షణ, పౌష్టికాహారం, వ్యక్తిగత పరిశుభ్రతలపై అవగాహన కల్పించే ప్రయత్నం ఈ ఉల్లాస్ కార్యక్రమాల ద్వారా చేయబోతున్నామన్నారు. చదువు మధ్యలో మానివేసిన వారిని గుర్తించి, ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్, డిగ్రీ చదివే విధంగా ప్రోత్సహించి, తద్వారా స్కిల్ డెవలప్మెంట్ టెక్నికల్ కోర్సులు నేర్చుకొని ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. నిరక్ష రాస్యులకు అనువైన సమయాలలో వారి గ్రామంలోనే వాలంటరీ టీచర్స్ చదువు నేర్పిస్తారన్నారు. గ్రామస్థాయిలోని వాలంటీరీ టీచర్స్ కి శిక్షణ ఇచ్చి ప్రేరణ కలిగిస్తున్నామన్నారు. మనిషికి చదువు విజ్ఞాన నేత్రమని, ప్రతి ఒక్కరూ విద్యావంతులు కావడానికి ప్రయత్నం చేయాలన్నారు. 2047నాటికి భారతదేశం సంపూర్ణ అక్షరాస్యత సాధించడానికి ప్రతి పౌరుడు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విఓఏలు ధనలక్ష్మి, మల్లీశ్వరి, వాలంటరీ టీచర్స్ శ్రీలత, శ్యామల, ఇందిరా, మహిళా సంఘాల మహిళలు కాకా కౌసల్య , ఎడమ సంతోషి, చంద్రకళ, పద్మ, వసంత, పాకటరత్నమ్మ, ముత్తమ్మ, మహేశ్వరి, చుక్కమ్మ తదితరులు పాల్గొన్నారు. 

Read More మీ సేవా సెంటర్‌లో జోరుగా సాగిన ఆన్లైన్ బెట్టింగ్ వ్యాపారానికి చెక్ పెట్టి 8 మంది మూఠా రిమాండ్ 

About The Author