వాసవి మా ఇల్లు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు రెయిన్ కోట్ ల పంపిణీ
సంగారెడ్డి :
వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు పంపిణీ చేశారు. మొత్తం 150 మంది కార్మికులకు రెయిన్ కోట్ లను అందజేశారు.. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ వాసవి మా ఇల్లు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కార్మికులకు రెయిన్ కోట్ లను పంపిణీ చేయడం అభినందనీయమని తెలిపారు. వాసవి మా ఇల్లు సంస్థ వ్యవస్థాపకులు తోపాజి అనంత కిషన్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు వర్షంలో పనిచేస్తున్నారని వారి కోసమే పంపిణీ చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో వాసవి మా ఇల్లు సంస్థ కార్యదర్శి తోపాజి హరీష్, సభ్యులు మ్యాడంరాధా కిషన్, కొంపల్లి విద్యాసాగర్, జూలకంటి బుచ్చిలింగం, అమేటి కిట్టు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కూన సంతోష్ కుమార్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు జార్జి, నాయకులు మహేష్ కుమార్, కిరణ్ గౌడ్, శ్రీహరి, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.