స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ నిర్మాణానికి రూ. 6 కోట్లు మంజూరు..
ఎల్బీనగర్
- వివరాలు తెలియజేసిన బానోతు సుజాత నాయక్..
- శనివారం జీ.హెచ్.ఎం.సి.లో స్టాండింగ్ కమిటీ సమావేశం..
ఎల్బీనగర్ నియోజకవర్గం లో స్ట్రామ్ వాటర్ డ్రైనేజీ నిర్మాణానికి ఆరు కోట్ల రూపాయలు మంజూరు అయినట్లు జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ తెలిపారు.. శనివారం జరిగిన జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సూచన మేరకు సమావేశంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలో వరద నీటి కాల్వల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరిన వెంటనే హయత్ నగర్ కుమ్మరి బస్తి నుండి బస్ డిపో ప్రాంతంలోని రాఘవేంద్ర నగర్ కాలనీ వరకు స్ట్రాం వాటర్ డ్రైనేజీ నిర్మాణం కోసం 6 కోట్లు నిధులు జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీలో మంజూరు చేసినట్లు తెలిపారు..
About The Author
02 Sep 2025