సంపూర్ణ అక్షరాస్యతను సాధించడమే ఉల్లాస్
మణుగూరు :
నిరక్షరాసులకు సంపూర్ణ అక్షరాస్యతను సాధించడమే ఉల్లాస్ లక్ష్యమని రిసోర్స్ పర్సన్ పూనెం రామకృష్ణ అన్నారు. గురువారం సమితిసింగారం గ్రామ పంచాయితీ కార్యాలయంలో వాలంటీర్స్ తో రామకృష్ణ ఉల్లాస్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్షరాస్యత, ప్రాధమిక విద్య ప్రతి వ్యక్తి జీవితంలో అత్యంత కీలకమైనవన్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించటానికి ఉల్లాస్ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. వివిధ కారణాల వల్ల 15 సంవత్సరాలు, ఆ పైబడిన చదువుకోని వయోజనులందరూ ఈ కార్యక్రమం ద్వారా సంపూర్ణ అక్షరాస్యత సాధించడం ప్రధాన ఉద్దేశమన్నారు. మనమంతా స్వచ్ఛందంగా పాల్గొని మన రాష్ట్ర అక్షరాస్యత స్థాయిని అగ్రస్థానంలో నిలపాలని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమం లో సెక్రటరీ శ్రీ కాంత్, విఓఏ స్రవంతి, వాలంటీర్స్ తదితరులు పాల్గొన్నారు.
Read More బీసీల దీక్షను విజయవంతం చేయాలి
About The Author
29 Aug 2025