విశ్వాసం చూపే కుక్కలపై దౌర్జన్యకాండ తగదు..

ఈ భూమ్మీద వాటికీ జీవించే హక్కు ఉంది.. 

  • సమాజానికి ఇదొక సవాల్ అంటున్నారు.. 
  • మిడి మిడి జ్ఞానంతో మాట్లాడే మాటలు ఇవి.. 
  • సుప్రీం కోర్టు తన నిర్ణయాన్ని సైతం మార్చుకుంది.. 
  • దీనినొక మాననీయ కోణంగా చూడాల్సిన అవసరం ఉంది.. 
  • ఆ హక్కును కాలరాసే అధికారం ఎవరికీ లేదు.. 
  • కుక్కలను భైరవుడిగా పూజించే దేశం మనది.. 
  • వాటికి పిచ్చి పట్టేలా చేస్తున్నది మనమే.. 
  • ఆకలితో అలమటించే కుక్కలకు పిడికెడు అన్నం పెట్టగలిగామా..? 
  • క్షుద్బాధ తీరక అవి పిచ్చిగా మారుతున్నాయి.. 
  • కుక్క కాటుకు రేబీస్ అనే వ్యాధి వస్తుంది.. 
  • మరి మనిషి కాటు వేస్తే పాము విషం కన్నా ప్రమాదకరం..
  • పోలీసు శాఖలో చురుగ్గా పనిచేసే కుక్కలు మనిషికంటే గొప్పవి..  
  • అలాంటి మనుషులను ఎందుకు సమాజంలో తిరగనిస్తున్నాం.. 
  • మానవతా దృక్పథంతో అందరూ ఆలోచించాలి.. 
  • ఎన్నో స్వచ్చంద సంస్థలు ఆ దిశగా పయనిస్తున్నాయి.. 
  • వీధి కుక్కలా సంరక్షణకు పిలుపునిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..    

భైరవ అనే పదం ఎంతో గొప్పగా ఉంటుంది.. భైరవ అంటే కుక్క.. ఇక మన ధర్మంలో కాలభైరవ ప్రాశస్తి ఎంతో ప్రాచుర్యం పొందింది.. కాల భైరవ స్వామిని మనసారా పూజిస్తే  జీవితంలో అన్ని కోర్కెలు నెరవేరతాయని నమ్ముతాం.. అయితే ప్రస్తుతం వీధి కుక్కలు అనే అంశం ఇప్పుడు హాట్ టాపిగ్ గా మారింది..  ఢిల్లీలో వీధి కుక్కలను ఏరిపారేయాలని కోర్టు ఆదేశించింది.. ఈ ఆదేశాలపై సర్వత్రా వ్యతిరేకత రావడంతో  ఆ ఆదేశాలను ఉపసంహరించుకుంది.. మానవతా దృక్పధంతో ఆలోచించి ఒక పరిష్కారం తేవాలని నిర్ణయించుకుంది..  అసలెందుకు ఇలాంటి నిర్ణయాలు వెలువడుతున్నాయి..? వీధి కుక్కలపై ఎందుకు వ్యతిరేక భావాలు రేగుతున్నాయి..? ఒక్కసారి ఆలోచిద్దాం.. కుక్కలకు టర్నింగ్ ఇస్తే ప్రమాదకర దుండగులను సులువుగా పట్టుకుంటాయి.. ఎంతో మందిని కాపాడిన ఘనమైన చరిత్ర కుక్కలకు వుంది.. ఇది ఎప్పుడూ మర్చిపోవద్దు.. మనతో పాటు అనేక జంతువులు జీవిస్తున్నాయి.. వాటన్నిటికీ మనతోబాటు జీవించే హక్కు వున్నప్పుడు వీధి కుక్కలకు ఎందుకు  లేదు..? వీధి కుక్కలు కరిస్తే రేబీస్ అనే వ్యాధి ప్రభలుతుందని.. అది ప్రాణాంతకమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు..  ఇది వాస్తవం.. కానీ వాటికి ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది.. ఆకలి.. అవును వీధి కుక్కలకు తగినంత ఆహారం దొరకడం లేదు..  దాంతో మానసికంగా అవి కృంగిపోతున్నాయి.. ఈ క్రమంలో వాటి శరీరాల్లో ఒక విధమైన రసాయనిక చర్య జరుగుతోంది..  ఆ చర్యతో కుక్కల శరీరం విషపూరితం అవుతోంది.. అవి కరచినప్పుడు వాటి దంతాలద్వారా రేబిస్ క్రిములు మనుషుల శరీరాల్లోకి ప్రవేశిస్తున్నాయి..  ప్రమాదకరంగా మారుతున్నాయి.. మరి కేవలం వాటిని సమాజానికి దూరంగా తరిమేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందా..? అంటే సమాధానం దొరకడం లేదు.. చాలా మంది జంతు ప్రేమికులు, కొన్ని స్వచ్చంద సంస్థలు మంచి సూచనలు ఇస్తున్నాయి..  వాటిని అమలు పరచగలిగితే ఈ సమస్య పెద్ద జఠిలమైనది కానీ కాదు.. వీధి కుక్కలా వినాశనం కోరుకోకుండా.. మానవతా దృక్పధంతో ఆలోచించాలని " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " కోరుతోంది.. 

WhatsApp Image 2025-08-29 at 6.12.16 PM

Read More కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు

స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ : హైదరాబాద్‌ నగరంలోని ప్రతి వీధి, ప్రతి మూలలోనూ కుక్కల గుంపులు కనిపించడం ఇప్పుడు సాధారణం అయిపోయింది. వీధి కుక్కల సంఖ్య పెరిగిపోవడం వల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు దాడులు, మరోవైపు ఆకలి, వ్యాధులతో అల్లాడుతున్న ఈ జంతువుల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. పశుసంవర్ధక శాఖ అంచనాల ప్రకారం నగరంలో లక్షకు పైగా వీధి కుక్కలు సంచరిస్తున్నాయి. ప్రతి ఏడాది వాటి సంఖ్య 10–15 శాతం వరకు పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు. సరైన నియంత్రణ లేకపోవడం, నిర్లక్ష్యం ఈ పరిస్థితికి దారి తీసిందని నిపుణుల అభిప్రాయం.

Read More సంపూర్ణ అక్షరాస్యతను సాధించడమే ఉల్లాస్

ఇటీవల కుక్కల దాడులు పెరగడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. చిన్న పిల్లలపై దాడులు, వాహనదారులపై దూకడం వంటి ఘటనలు పలు ప్రాంతాల్లో నమోదవుతున్నాయి. కొన్నిసార్లు ఈ దాడులు ప్రాణాంతకమయ్యాయి. దీంతో రాత్రివేళల్లో రోడ్లపై తిరగడానికి ప్రజలు భయపడుతున్నారు. అయితే మరోవైపు వీధి కుక్కలు కూడా ఆకలి, దాహం, వ్యాధులతో బాధపడుతున్నాయి. రోడ్డు పక్కన పడేసిన చెత్తలో ఆహారం కోసం వెతకడం, వర్షం పడితే వణుకుతూ రోడ్డు పక్కనే గడపడం వాటి దైనందిన జీవితం. సరైన ఆశ్రయం లేక, చికిత్సలు అందక చిన్న వయసులోనే చనిపోతున్నాయి. "కుక్కలు శత్రువులు కావు. అవి కూడా మనలాంటి జీవులే. ఆకలితో, భయంతోనే దాడి చేస్తాయి. వాటికి ఆహారం, నీరు, టీకాలు అందిస్తే సమస్య తక్కువ అవుతుంది" అని జంతు హిత సంఘాల ప్రతినిధులు చెబుతున్నారు. వీధి కుక్కల కోసం ప్రత్యేక ఆశ్రమాలు, టీకా శిబిరాలు నిర్వహించాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Read More పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్నది..

జీహెచ్ఎంసీ  అధికారులు వీధి కుక్కల నియంత్రణ కోసం శస్త్రచికిత్సలు, టీకా కార్యక్రమాలు చేపడుతున్నారు. "ప్రతి నెలా వందల సంఖ్యలో కుక్కలకు శస్త్రచికిత్సలు చేస్తున్నాం. కానీ సమస్య పరిష్కారం కావాలంటే ప్రజలు కూడా సహకరించాలి" అని అధికారులు తెలిపారు. మరీ ముఖ్యంగా వీధి కుక్కల సమస్యను కేవలం ప్రమాదంగా మాత్రమే కాకుండా, మానవత్వం కోణంలో కూడా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు. సమాజంలో కొందరు కుక్కలకు ఆహారం పెడుతూ, నీళ్లు ఇస్తూ మానవత్వాన్ని చాటుతున్నారు. "మనుషుల కరుణే వీధి కుక్కలకు నిజమైన రక్షణ" అని జంతు ప్రేమికులు చెబుతున్నారు.

Read More కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలి

ప్రతి రోజూ ఎంతో ఖరీదైన ఆహారాన్ని వేదులపాలు చేస్తుంటాం.. అలా వృధా చేయకుండా కుక్కలకు అందించగలిగితే.. అవి తమ ఆకలి తీర్చుకుని కృతజ్ఞతగా ఉంటాయి.. అలాగే చాలామంది సంపన్నులు లక్షలు వెచ్చించి కుక్కలను కొని పెంచుకుంటుంటారు.. తప్పులేదు.. కానీ వాటిపై పెట్టే ఖర్చులో ఒక్క శాతం వీధికుక్కల కోసం కేటాయించగలిగితే సగం సమస్య పరిష్కారం అవుతుంది.. వీధి కుక్కలను దైవాలుగా భావించకపోయినా పర్వాలేదు..  కనీసం మనతో బాటు బ్రతుకుతున్న జీవాలు అని గుర్తిస్తే చాలు.. సమాజంలోని ప్రతి ఒక్కరు నెగెటివ్ గా  కాకుండా కొంచం పాజిటివ్ గా ఆలోచిస్తే ఎంతో మంచిది.. మనం గొప్పగా చెప్పుకుంటున్న కొన్ని సోకాల్ట్ పత్రికలు వీధి కుక్కలా గురించి  చాలా దారుణంగా రాస్తున్నారు.. అలాంటి పిచ్చి పనులు చేయకుంటే ఎంతో మంచిది.. మనిషి కంటే విశ్వాసంగా జంతువు కుక్క..  అలాంటి కుక్కల పట్ల ప్రేమ, వాత్సల్యం చూపడం ఎంతో అవసరం.. వీధి కుక్కల సమస్యను పూర్తిగా పరిష్కరించాలంటే ప్రభుత్వం, జంతు హిత సంఘాలు, ప్రజలు కలిసి కృషి చేయాలి. నియంత్రణ చర్యలతో పాటు కరుణ, మానవత్వం కూడా అవసరం. వీధి కుక్కలు శత్రువులు కాదు.. అవి మనతో పాటు బ్రతుకుతున్న జీవులు అని సమాజం గుర్తిస్తే, సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ " సవినయంగా వేడుకుంటోంది..  ప్రతిరోజూ ఒక కుక్కకి ఒక్క పూటైనా ఆహారం పెడదాం.. ఇదే మన నినాదం కావాలి..

Read More బొంతపల్లి పాఠశాల విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ

About The Author