స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలి..
రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి మకరందు మంద.
ఉమ్మడి ఆదిలాబాద్ :
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లలో పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి మకరందు మంద అన్నారు. శుక్రవారం సాయంత్రం పలు జిల్లాల అదనపు కలెక్టర్లతో ఆయన స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రణాళిక పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని సదుపాయాలను సమకూర్చుకోవాలని తెలిపారు. ఇక్కడ కూడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికల నిర్వహణ చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మాట్లాడుతూ, అధికారులంతా స్థానిక సంస్థల ఎన్నికల పకడ్బందీ ప్రణాళికలను రూపొందించాలని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవసరమైన సామాగ్రి మొత్తం సరిపడినంత సమకూర్చుకోవాలని అన్నారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికలను నిర్వహించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో గోవింద్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.