భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి.

జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా : 

భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి.

WhatsApp Image 2025-08-28 at 6.16.27 PM

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎటువంటి ఆందోళన చెందవద్దని, అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు.గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడిన కలెక్టర్, అత్యవసరమైతే తప్ప ఎవరూ ఇళ్ల నుండి బయటకు రాకూడదని కోరారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్నవారు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని గుర్తించి పునరావాస కేంద్రాలకు తరలించామని తెలిపారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా వెంటనే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నంబరు 9100577132 ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. ప్రాజెక్టులు, చెరువులు పూర్తిస్థాయిలో నిండిపోవడంతో ఉధృతంగా ప్రవహిస్తున్నాయని, ప్రజలు లోతట్టు పరిసరాలకు వెళ్లరాదని, మత్స్య కారులు, పశు కాపరులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. రోడ్లు, వంతెనలు దెబ్బతిన్న ప్రాంతాల్లో తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

Read More వాసవి మా ఇల్లు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులకు రెయిన్ కోట్ ల పంపిణీ

లక్ష్మణచందా మండలంలోని మునిపల్లి గ్రామంలో వాగు అవతలి వైపు చిక్కుకుపోయిన శంకర్ అనే పశువుల కాపరిని ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహకారంతో సురక్షితంగా రక్షించగలిగామని కలెక్టర్ వివరించారు. జిల్లా ప్రజలంతా సురక్షితంగా ఉండాలని, అధికారులు క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నారని కలెక్టర్ భరోసా ఇచ్చారు.ఈ విలేకరుల సమావేశంలో డిపిఆర్ఓ విష్ణువర్ధన్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Read More పదే పదే నేరాలకు పాల్పడిన వారిపై గ్యాంగ్ ఫైల్స్ ఓపెన్ చేయాలి

About The Author