ప్రభుత్వం కల్పిస్తున్న క్రీడా సౌకర్యాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలి....

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ఖమ్మం : 

విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు ప్రత్యేక సమయం కేటాయించాలి
క్రీడా సంస్కృతిని పెంపొందించేందుకు క్రీడాకారులు పోటీపడాలి
జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంలో నిర్వహించిన 3కె రన్ ను ప్రారంభించి, పాల్గొన్న జిల్లా కలెక్టర్

 

WhatsApp Image 2025-08-29 at 7.17.53 PM

Read More హనుమకొండ లో హోటల్ కాకతీయ 369 మినీ బంకేట్ హల్ ప్రారంభం

విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి భవిష్యత్తులో మరింత మంచి నైపుణ్యాన్ని కనబర్చి జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని, ప్రభుత్వం క్రీడల అభివృద్దికి కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.

Read More జోనల్ లెవెల్ క్రీడల ప్రారంభోత్సవానికి మంత్రులు : డిసిఓ వెంకటేశ్వర్లు

స్థానిక సర్ధార్ పటేట్ స్టేడియంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహించారు. సర్ధార్ పటేట్ స్టేడియంలో భారతదేశ కీర్తిని ప్రపంచానికి చాటిన హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి  జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను కలెక్టర్ సన్మానించి, జ్ఞాపికలు అందించారు. వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. మేజర్ ధ్యాన్‌చంద్‌ దేశానికి చేసిన సేవలు, ఆయన గొప్పతనాన్ని, క్రీడల ప్రాముఖ్యతను వివరిస్తూ, విద్యార్థులు క్రీడల్లో అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో రాణించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

Read More సాహితీ రాము స్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాముల శబరిమల మహాపాదయాత్ర

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ క్రీడల పోటీల వలన ఆరోగ్యం, ఉల్లాసం, సాంఘిక సౌభ్రాతృత్వం పెరిగి  శారీరక, మానసిక పనితీరు మరింత మెరుగవుతుందని  అన్నారు. విద్యార్థులు ప్రతిరోజు తప్పనిసరిగా క్రీడలకు ప్రత్యేక సమయం కేటాయించాలని, క్రీడలు ఆడటం వల్ల మనకు ఒత్తిడి తగ్గుతుందని తెలిపారు. గ్రామీణా ప్రాంతాల్లో ఉండే విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యం అధికంగా ఉంటుందని, ఉపాధ్యాయులు విద్యార్థులను క్రీడల్లో ఉన్నతంగా తీర్చిదిద్దాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిభావంతులైన క్రీడాకారులకు ప్రోత్సహిస్తుందన్నారు. విద్యార్థి దశ నుంచే చదువుతో పాటు క్రీడల్లో రాణించడం ద్వారా ఆత్మవిశ్వాసం, ధైర్యం వంటి లక్షణాలు విద్యార్థులలో అలవాడతాయని అన్నారు. క్రీడలలో ఎంపిక అవడం వలన విద్య, ఉద్యోగ ఉపాధి లో మరింత మెరుగైన అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

Read More పోలీసు ప్రతిష్టను కించపరిచేలా తప్పుడు సమాచారం ప్రసారం చేయవద్దు

భారత దిగ్గజం హాకీ ఆటగాడు దేశానికి, క్రీడా రంగానికి ధ్యాన్‌చంద్‌ చేసిన సేవలు మరువలేనివని కలెక్టర్ కొనియాడారు. భారతదేశానికి క్రీడల్లో కీర్తి సంపాదించి పెట్టిన క్రీడా దిగ్గజం ధ్యాన్‌చంద్‌ పుట్టిన రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపడం అభినందనీయమన్నారు.

Read More విద్యార్థులను బలిపశువులను చేస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వివాదం..

యువతకు క్రీడా స్ఫూర్తినిచ్చేందుకు  ప్రతిభను చూపి రాష్ట్ర స్థాయి క్రీడల్లో చేరేవారని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోనే యువతకు అందుబాటులో స్టేడియాల సమర్థ వినియోగం, అధునాతన పరికరాలు, కోచ్‌లకు మంచి ప్రమాణాలతో శిక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం, మంత్రుల సహాకారంతో క్రీడాకారులను ప్రోత్సహించడానికి భవిష్యత్తు అవసరాలను దష్టిలో ఉంచుకొని స్టేడియంలో మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని కలెక్టర్ అన్నారు. 

Read More చిన్న నీటి పారుదల వివరాల గణాంక ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్.

ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ ఇన్ డోర్ స్టేడియంలో యునెక్స్ సన్ రైజ్ 11వ తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ బాలబాలికల బాట్మ్ మెంట్ చాంపియన్ షిఫ్ పోటోలను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి లాంఛనంగా ప్రారంభించారు. 

Read More అభివృద్ధి పనులకు 2కోట్ల హెచ్ఎండిఏ నిధులు మంజూరు

ముందుగా శుక్రవారం ఉదయం 3కె రన్ ను సర్ధార్ పటేట్ స్టేడియం వద్ద ఆదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించి, 3కె రన్ లో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఇల్లెందు క్రాస్ రోడ్, జిల్లా కోర్టు, ఇందిరనగర్ సెంటర్ నుండి జెడ్పి సెంటర్ మీదుగా రన్ ర్యాలీ సాగింది.

Read More సదర్ ఉత్సవాల్లో జగ్గారెడ్డి సందడి

ఈ కార్యక్రమంలో  జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి సునీల్ రెడ్డి, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి రవిబాబు, అధికారులు, కోచ్ లు, క్రీడాకారులు,  తదితరులు పాల్గొన్నారు. 

Read More ప్రభుత్వ పాఠశాలలో బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమం ఎంపీఓ చంద్రశేఖర్.

About The Author