జీహెచ్ఎంసి పురోగతిలో మీ సేవలు మరువలేనివి..

హైదరాబాద్ :

- కొనియాడిన జీ.హెచ్.ఎం.సి. కమిషనర్ ఆర్ వి కర్ణన్
- పదవి విరమణ పొందిన 25 మంది జిహెచ్ఎంసి అధికారులు, ఉద్యోగులకు ఆత్మీయ సత్కారం.. 

WhatsApp Image 2025-08-30 at 7.13.30 PM

జీహెచ్ఎంసి పురోగతిలో పదవీ విరమణ పొందిన ఉద్యోగుల  సేవలు మరువలేనివనీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. శనివారం సాయంత్రం జీ.హెచ్.ఎం.సి. హెడ్ ఆఫీస్ లో పదవీ విరమణ పొందిన వివిధ స్థాయిలోని 25 మంది అధికారులు, ఉద్యోగులను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్  శాలువా , పూల దండలతో సత్కరించారు. గిఫ్ట్ లను బహుకరించారు.

Read More స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేయాలి..

ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ... పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులందరూ తమ ఉద్యోగ జీవితంలో ఎంతో నిబద్ధత, అంకిత భావంతో సేవలందించారన్నారు. వారి కృషి, అందించిన సేవలు తమ సహచర ఉద్యోగులకు స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. రిటైర్మెంట్ అన్నది జీవితంలో కొత్త అధ్యాయం లాంటిదని, రిటైర్మెంట్ పొందిన వారు వారి కుటుంబ సభ్యులతో సమయం గడుపుతూ, తమ ఆసక్తులకు ప్రాధాన్యం ఇస్తూ ఆరోగ్యంతో, ఆనందంగా గడపాలని ఆయన సూచించారు. వారి మున్ముందు జీవితం ఆయురారోగ్యాలతో ఆనందంగా గడపాలని కోరారు.

Read More వరంగల్ మెడికవర్‌ హాస్పిటల్ లో అరుదైన శస్త్రచికిత్సతో పేషెంట్ చెయ్యి కాపాడిన వైద్య నిపుణులు

పదవీ విరమణ పొందిన వారి వివరాలు :
డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లు టి. ఎస్. ఆర్. అంజనేయులు, పీర్ సింగ్, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ కే. శ్రీనివాస్ రావు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ సయ్యద్ సయ్యిదుద్దిన్, సీనియర్ అసిస్టెంట్ లు  ఎం. నర్సింఘారావు, పి. రమేష్, వి.ఆర్.విజయలింగం, ప్రాజెక్ట్ ఆఫీసర్ లు కె.ప్రభాకర్, ఎం.సంగారెడ్డి, జూనియర్ అసిస్టెంట్ కె.జానకి, రికార్డు అసిస్టెంట్ షేక్ రమీజుద్దీన్, హెల్త్ అసిస్టెంట్ పి.దుర్గారావు, జూనియర్ ఫిట్టర్ కె.సత్యనారాయణ, హెవి వెహికిల్ డ్రైవర్ మహమ్మద్ రబ్బని, శానిటరి జవాన్ ఎం.డి అయుబ్, పి.హెచ్ వర్కర్ టి.నర్సింహా, ఆఫీస్ సబార్డినేట్ రామ్ సింగ్, కామాటి లు జంగరాజ్, ఎస్.వెంకటయ్య, లింగయ్య, బి.శంకరయ్య, చౌకిదార్ ఎల్.గిరిజ, చైన్ మెన్ డి.మహేందర్, మెన్ మజ్దూర్ జె.ఆంజనేయులు, కామాటన్ కృషీ డి బేగంలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమీషనర్ వేణుగోపాల్, సిపిఆర్ఓ మహ్మద్ ముర్తుజా, పిఆర్ఓ యం దశరథం,  ఏ.ఎం.సి  శారద, సహ ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, తదితరులు పాల్గొన్నారు.

Read More పోలీసు ఉద్యోగం ఎన్నో సవాళ్లతో కూడుకున్నది..

About The Author