వరంగల్ మెడికవర్ హాస్పిటల్ లో అరుదైన శస్త్రచికిత్సతో పేషెంట్ చెయ్యి కాపాడిన వైద్య నిపుణులు
ఉమ్మడి వరంగల్ :
మెడికవర్ హాస్పిటల్ వరంగల్‌లో అత్యవసర శస్త్రచికిత్స ద్వారా ఒక పేషెంట్ చెయ్యిని విజయవంతంగా కాపాడారు.
తిరుపతి అనే వ్యక్తి బ్రెయిన్ స్ట్రోక్‌కి గురై ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందిన అనంతరం డిశ్చార్జ్ అయ్యారు. ఇంటికి చేరిన రోజే అతనికి కుడి చేయిలో విపరీతమైన నొప్పి రావడంతో లోకల్ డాక్టర్ సంప్రదించారు. డాక్టర్ పరీక్షించి, రక్త ప్రసరణ ఆగిపోవడం గమనించారు. వెంటనే వారు మెడికవర్ హాస్పిటల్ చేరుకున్న వెంటనే, డాక్టర్లు డాక్టర్ రవి కిరణ్ కన్సల్టెంట్ కార్డియోథరాసిక్ వ్యాస్కులర్ సర్జన్ డాక్టర్ ప్రియాంక కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అత్యవసరంగా పరీక్షలు చేసి కుడి చేయి రక్తనాళాల్లో (Brachial, Radial & Ulnar arteries) తీవ్రమైన Thrombosis ఏర్పడినట్లు గుర్తించారు. వెంటనే arterial thrombectomy శస్త్రచికిత్స చేసి రక్తగడ్డలను తొలగించి రక్తప్రసరణను పునరుద్ధరించారు. సమయానికి చికిత్స అందించడంతో పేషెంట్ చేయి కాపాడగలిగారు.