కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు మీడియా సమావేశం
కామారెడ్డి జిల్లా :
కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బిఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాల కాలంలో ఎన్నో విపత్తులు జరిగాయి. ఏ రోజు కూడా స్పందించలేదు, నష్టపరిహారం అందించలేదు, వారిని పరామర్శించిన పాపాన కూడా పోలేదని, తెలిపారు.
ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి పర్యవేక్షించి రివ్యూ చేయాలనుకున్నారు, వాతావరణం అనుకూలం లేనందున కామారెడ్డిలో దిగలేకపోయారు. హెలికాప్టర్ లో వచ్చి ఏరియల్ సర్వే చేశారు. హుటాహుటిన మంత్రులను అధికారులను అప్రమత్తం చేసి జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ డి ఆర్ ఎఫ్, ఎన్ డి ఆర్ ఎఫ్, బృందాలు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, విద్యుత్ శాఖ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, షబ్బీర్ ఆలీ ఫౌండేషన్ వారు, యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టి ప్రాణ నష్టం జరగకుండా కష్టపడ్డారు. నివాసం కోల్పోయిన వారికి కళ్యాణ మండపాల్లో నివాసం ఏర్పాటు చేశారు. ప్రతిరోజు పట్టణంలో 3,000 మందికి మండలాల్లో 2000 మందికి అన్నదానం చేయడం జరిగిందని తెలిపారు. తక్షణ సహాయం కింద 11,500 ప్రకటించి విడుదల చేశారు. షబ్బీర్ ఆలీ అభ్యర్థన మేరకు ఎమ్మెల్సీల బృందం పర్యటించి అధికారులు, నాయకులు, మంత్రులు పర్యటించి సర్వేలు నిర్వహించి జరిగిన నష్ట అంచనాలు ప్రభుత్వానికి పంపించడం జరిగింది. త్వరలో నష్టపోయిన వారందరికీ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.