
ప్రతిష్టాత్మకమైన బీసీ రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి పాస్ అయ్యేలా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి దానసరి అనసూయ సీతక్ కు ములుగు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింత నిప్పుల బిక్షపతి సోమవారం ఒక ప్రకటనలో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
చట్టసభలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రవేశపెట్టిన 2025 బీసీ రిజర్వేషన్ బిల్లును ఆదివారం శాసనసభలో ప్రవేశపెట్టిన మంత్రి సీతక్క కు బిల్లు పాస్ కావడానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి మండలి సభ్యులు, శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎప్పుడు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటుందని దానికి నిదర్శనమే ఈ బీసీ బిల్లు బీసీలు రాజకీయంగా ఎదుగుదలకు ఈ బిల్లు ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం బీసీలపై ఏ మాత్రం చిత్తశుద్ది ఉన్న బీసీ రిజర్వేషన్ బిల్లును తొందరగా పాస్ అయ్యే విధంగా చూడాలని ఈ సందర్భంగా బిక్షపతి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రపతిని ఆయన కోరారు. బడుగు బలహీన వర్గాలు బీసీలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటామని అన్నారు.