కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసే కాళేశ్వరంపై కుట్రలు
సోషల్ మీడియా కన్వీనర్, రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి
ములుగు జిల్లా :
తెలంగాణకు వరప్రధాయని లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరుగుతున్న తతంగం అంతా మోడీ, రేవంత్ రెడ్డి కలిసి చేస్తున్న కుట్ర లని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో ఆరోపించారు. సంక్షేమ ఫలాలతో దేశానికే తెలంగాణను రోల్ మోడల్ గా నిలిపిన బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలని రేవంత్ రెడ్డి ద్వారా మోడీ కుట్ర చేస్తున్నారని అన్నారు. కమిషన్ రిపోర్ట్ చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతోందని తెలిపారు.
గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఇచ్చిన ఎన్డీఎస్ఏ మోడీ చేతిలో తోలుబొమ్మ అని.. ఇప్పుడు సీబీఐ కూడా తోలుబొమ్మేనని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి తాను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రినని చెప్పుకుంటూ.. పూర్తిగా మోడీ చేత.. మోడీ కొరకు.. మోడీ వలన పనిచేస్తున్నారని సతీష్ రెడ్డి ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు కేసీఆర్ చేసిన మంచి ఏంటో ప్రజలందరికి తెలునన్నారు. అలాగే.. రేవంత్ రెడ్డి, బీజేపీ కలిసి ఆడుతున్న నాటకమని ప్రజలకు తెలిసిపోయిందని పేర్కొన్నారు.