అక్రమకేసులు కాదు అభివృద్ధిపై దృష్టి పెట్టండి

బిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు

ఖమ్మం : 

నాడు బి ఆర్ ఎస్ హయాంలో అభివృద్ధి ప్రథమస్థానంలో ఉన్న ఖమ్మం కార్పొరేషన్ ను నేటి  ప్రభుత్వ హయాంలో 64వ స్థానంలో పడేసింది కాంగ్రెస్ పార్టీ . పోరాడి తెలంగాణ సాధించుకున్న బిఆర్ఎస్ కార్యకర్తలు కేసులకు భయపడరు

WhatsApp Image 2025-08-29 at 7.28.26 PM

బిఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమకేసులు పెట్టడం కాదు అభివృద్ధికి ఆమడ దూరంలోకి పడిపోయి నగర ప్రజలు అవస్థలు పడుతున్నారని ఖమ్మం కార్పొరేషన్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని బిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, జిల్లా నాయకులు ఆర్జెసి కృష్ణ, మక్బూల్ అన్నారు. బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం తెలంగాణ భవనంలో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.... గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో 48 వ డివిజన్ లోకి నీళ్ళు వస్తె జేసీబీ లతో కార్పొరేటర్ పనులు చేపిస్తే కాంగ్రెస్ నాయకులు వాళ్ళు చేసినట్లు ఫోటోలు దిగుతున్నారని విమర్శించారు. అంతేకాకుండా మేయర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సమావేశం ఏర్పాటుచేసి మా కార్పొరేటర్ మీద అబద్ధపు ప్రచారాలు చేయడం సిగ్గుచేటన్నారు. గత సంవత్సరం వచ్చిన వరదల్లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వరద బాధితులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసి సహాయ సహకారాలు అందించారని గుర్తుచేశారు. అభివృద్ధికి ఒకటి కాదు 10 జేసీబీ లు పంపించి పని చేయండన్నారు. మీరు భయపడితే భయపడటానికి మేము మామూలు కార్యకర్తలం కాదు బీఆర్ఎస్ కార్యకర్తలం నిత్యం పోరాటాలు చేసే పార్టీ కార్యకర్తలం అన్నారు. నగర జనాభా డెంగ్యూతో ఆసుపత్రి పాలు అవుతుంటే అర్థమవుతుంది కాంగ్రెస్ చేసే అభివృద్ధి ఎలా ఉందో అని ఎద్దేవ చేశారు. బీఆర్ఎస్ పార్టీ సమయంలో ప్రథమ స్థానంలో ఉన్న ఖమ్మం కార్పొరేషన్ ను 64 వ స్థానంలో పడేసింది కాంగ్రెస్ పార్టీ అని దుయ్యబట్టారు. మాజీ మంత్రి హరీష్ రావు కాలుపైన దాడి జరిగితే ఇంతవరకు కేసు నమోదు చేయలేని స్థితిలో పోలీసు వ్యవస్థ ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ ఇళ్లు 50 వేలు, లక్షకు అమ్ముకుంటున్నారని, ఇందిరమ్మ ఇళ్ల పేరుతో దొంగ పట్టాలు తయారు చేస్తున్నారని ఆరోపించారు. 

Read More ప్రమాదాల నివారణకు కాటమయ్య రక్ష కిట్లు

ఈ సందర్భంగా తోట రామారావు మాట్లాడుతూ... అభివృద్ధి చేస్తుంటే  అక్రమ కేసులు పెట్టడం సరికాదు.  బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. వర్షపు నీళ్లతో మహిళలు ఇబ్బంది పడుతున్నారని జేసీబీతో పని చేపిస్తుంటే కొంతమంది, వాళ్ళెవరో కూడా నాకు తెలియదు అల్లే సాయికిరణ్ అనే వ్యక్తి వచ్చి మాతో వాగ్వాదానికి దిగారన్నారు. వారిద్దరిని ఆపేందుకు నేను వెళ్తే నన్ను పట్టుకొని తోట రామారావు ఖబడ్దార్ అని, అదేవిదంగా నన్ను రౌడీ షీటర్ అంటున్నారు, దానికి ముందున్న గతం గురించి తెలుసుకోండన్నారు. భగత్ సింగ్ వారసులు అంటున్నారు, మీరు కాదయ్య మేము, మా కుటుంబం భగత్ సింగ్ వారసులం అని అన్నారు. మీరు మమ్మల్ని ఏదైనా చేస్తా అంటే ఆ లోపే పని ముగిస్తాం అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే సమయంలో, ముగ్గు పోసే సమయంలో కానీ స్థానిక కార్పొరేటర్ గా ప్రోటోకాల్ ప్రకారం ఎందుకు పిలవలేదని నిలదీశారు. అభివృద్ధి చేస్తున్న మా పైన అక్రమ కేసులు పెట్టడం కాదు, మమ్మల్ని ఇబ్బంది కి గురి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు, కార్పొరేటర్లు పసుమర్తి రామ్మోహన్, మాటేటి నాగేశ్వరరావు, తోట వీరభద్రం, రుద్రగాని ఉపేందర్, పొన్నం వెంకటేశ్వర్లు, ఎర్ర అప్పారావు, పాలడుగు పాపారావు, వంగల వెంకట్, చేతి కృష్ణ, మాటేటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. 

Read More వినాయక నిమజ్జన ఊరేగింపులకు డీజేకీ అనుమతులు లెవు

About The Author