రాజన్న ఆలయంలో అభివృద్ధి పనుల పర్యవేక్షణ
వేములవాడ :
వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను శుక్రవారం ఆలయ ఈవో రాధాబాయి స్వయంగా పర్యవేక్షించారు.ఓపెన్ స్లాబ్, కళ్యాణ కట్ట, ప్రధాన ఆలయ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పనులను సమీక్షిస్తూ, భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.అలాగే ఆలయ అర్చకులు, వేద పండితులు,ఇన్చార్జి స్థానాచారి నమిలికొండ ఉమేష్ శర్మ, ప్రధాన అర్చకులు ఈశ్వర గారి సురేష్, చంద్రగిరి శరత్ కుమార్, తమ్మల వెంకన్న తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా భద్రత నిర్వహణ కోసం ఎస్పీఎఫ్ ఎస్ఐ మహేందర్,ఆలయ ఉద్యోగులు సైతం పాల్గొని
ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా భక్తులకు మరింత సౌకర్యం కలిగించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఆలయ అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈఈ రాజేష్, డీఈలు రఘునందన్, మైపాల్ రెడ్డి, ఏఈఓ జి. శ్రావణ్ కుమార్, పర్యవేక్షకులు జి. శ్రీనివాస్ శర్మ, వెల్ది సంతోష్, ఆలయ ఇన్‌స్పెక్టర్ నూగురి నరేందర్ పాల్గొన్నారు.