రాజన్న ఆలయ నూతన ఈవో గా రమాదేవి
వేములవాడ :

దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి రాజన్న ఆలయంలో నూతన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో)గా ఎల్. రమాదేవి శనివారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన ఈవో రమాదేవి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వస్తి వచనాలతో వారిని స్వాగతించారు. కళ్యాణ మండపంలో వేద పండితులు ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సహాయ నిర్వాహక అధికారి శ్రీ జి. శ్రావణ్ కుమార్ స్వామివారి ప్రసాదం, చిత్రపటాన్ని ఆలయ ఈవో రమాదేవి కి అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షకులు శ్రీ జి. శ్రీనివాస్ శర్మ, శ్రీ వెల్ది సంతోష్, శ్రీ వి వెంకట ప్రసాద్, శ్రీ ఎం రాజేందర్ (సీనియర్ అసిస్టెంట్), శ్రీ ఓ భాస్కర్, శ్రీ బొడుసు మహేష్ మరియు ఆలయ వేద పండితులు పాల్గొన్నారు.
Read More నేటి భారతం :
About The Author
08 Nov 2025
