ఘనంగా ఉద్యోగ విరమణ అభినందన సభ
సంగారెడ్డి :
తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా కేంద్రంలో శనివారం పలువురు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కార్మిక శాఖకు చెందిన దుర్గయ్య, చీఫ్ ప్లానింగ్ కార్యాలయ ఉద్యోగి సత్యనారాయణ, ఇరిగేషన్ శాఖ ఉద్యోగి ఆనంద్ లను జిల్లా ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు షరీఫ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఉద్యోగ సమయంలో వారు అందించిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. వారి శేష జీవితం సంపూర్ణ ఆరోగ్యంగా కుటుంబ సభ్యులతో హాయిగా సాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ జనరల్ సెక్రెటరీ నాగరాజు అసోసియేషన్ ప్రెసిడెంట్ అశోక్ టౌన్ అధ్యక్షుడు పండరి ట్రెజరర్ ప్రవీణ్ కుమార్ ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Read More విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి చూపాలి
About The Author
02 Sep 2025