భారీ వర్షాలుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఎస్పీ

భారీ వర్షాలుకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : జిల్లా ఎస్పీ

ములుగు జిల్లా ప్రతినిధి, జులై 23 (భారతశక్తి) : రాష్ట్రంలో వారం రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసినందున లోతట్టు, గోదావరి పరివాహక ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా ఎస్పీ శబరీష్.పి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వరద ప్రవాహం ఉన్న వంతెనలు, కల్వర్ట్, రహదారులపై నుండి ప్రజలు దాటవద్దని, శిధిల వ్యవస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండద్దని, తడిగా ఉన్న కరెంట్ పోల్స్, ట్రాన్సఫర్స్ తాకవద్దని, గ్రామాలలో చేపల వేటకు ఎవరు వెళ్ళొద్దని అత్యవసరమైతే తప్ప ప్రజలు బయట రావద్దని, వరద ప్రవాహల వద్ద బందోబస్త్ ఉన్న పోలీస్ సిబ్బందికి సహకరించాలని సూచించారు.

జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు, ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎదురైన వాటిని ఎదుర్కొనేందుకు జిల్లా పోలీస్ శాఖ సంసిద్ధంగా ఉందని, ముంపు ప్రాంతాల ప్రజలకు తక్షిణ సహాయం కోసం డిడిఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. విపత్కార పరిస్థితులు ఎదురైతే ప్రజలు పోలీస్ శాఖ సహాయం తీసుకోవాలని, 100 డయల్ ని సద్వినియోగం ేసుకోవాలని ఎస్పీ తెలిపారు.

Read More వసతి గృహాల్లో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి.. 

About The Author