
వేములవాడ : దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని బుధవారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సతీమణీ అపర్ణ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండపంలో ఆలయ అర్చకులు ఆశీర్వచనం అందజేశారు. వారికి ఆలయ ఈవో ఎల్. రమాదేవి స్వామి అమ్మవార్ల వస్త్రాలు, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.