రామస్వామి గట్టు వద్ద కబ్జాలో ఉన్న ప్రతి ఒక్కరికి పట్టాలు ఇస్తామని మాట తప్పిన ఉత్తమ్!

సూర్యాపేట జిల్లా బ్యూరోభారతశక్తి, ఫిబ్రవరి 3: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో రామస్వామి గట్టు వద్ద నివాసం ఉంటున్న నిర్వాసితులకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా హుటా హుటిన ఇల్లు ఖాళీ చేయాలని అధికారులు ఇబ్బంది పెడుతున్నారని సోమవారం హుజూర్ నగర్ పట్టణంలోని ఇందిరా చౌక్ (అడ్డ రోడ్డు) వద్ద మహిళలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018 సంవత్సరంలో తమపై హుజూర్ నగర్ తహశీల్దార్ కేసులు కూడా నమోదు చేసారని అట్టి కేసులు నేటి వరకు విచారణలోనే ఉన్నాయని ప్రభుత్వ భూములలో గత 10 సంవత్సరాల నుండి కబ్జాలో ఉన్న తమకు పొజిషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి పట్టాలు జారీ చేస్తామని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చి నేడు హామీని మరిచి మా సొంతింటి కలను చెదరగొడుతున్నారని తమ ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపకుండానే హుజూర్ నగర్ తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది వచ్చి బుధవారం తాముంటున్నా ఇళ్ళు ఖాళీ చేయాలని లేదంటే కూల్చి వేయడం జరుగుతుందని తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండి పడుతున్నారు. తమకు నివాసానికి అనువైన ప్రదేశాన్ని కానీ లేదా సింగిల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిస్తే తానే ఖాళీ చేసి వెళ్లడం జరుగుతుందని తెలిపారు. వెంటనే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున ఎలాంటి ధర్నాలు చేయడం చట్టరీత్యా నేరమని అధికారుల వద్ద సమస్య పరిష్కరించు కోవాలని మహిళలకు సర్ది చెప్పి పంపించారు.

రామస్వామి గట్టు వద్ద కబ్జాలో ఉన్న ప్రతి ఒక్కరికి పట్టాలు ఇస్తామని మాట తప్పిన ఉత్తమ్!

సూర్యాపేట జిల్లా బ్యూరోభారతశక్తి, ఫిబ్రవరి 3:
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో రామస్వామి గట్టు వద్ద నివాసం ఉంటున్న నిర్వాసితులకు ఎలాంటి నోటీసులు జారీ చేయకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా హుటా హుటిన ఇల్లు ఖాళీ చేయాలని అధికారులు ఇబ్బంది పెడుతున్నారని సోమవారం హుజూర్ నగర్ పట్టణంలోని ఇందిరా చౌక్ (అడ్డ రోడ్డు) వద్ద మహిళలు ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2018 సంవత్సరంలో తమపై హుజూర్ నగర్ తహశీల్దార్ కేసులు కూడా నమోదు చేసారని అట్టి కేసులు నేటి వరకు విచారణలోనే ఉన్నాయని ప్రభుత్వ భూములలో గత
10 సంవత్సరాల నుండి కబ్జాలో ఉన్న తమకు పొజిషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి పట్టాలు జారీ చేస్తామని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చి నేడు హామీని మరిచి మా సొంతింటి కలను చెదరగొడుతున్నారని తమ ఆవేదన వ్యక్తం చేశారు. మాకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపకుండానే హుజూర్ నగర్ తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది వచ్చి బుధవారం
తాముంటున్నా ఇళ్ళు ఖాళీ చేయాలని లేదంటే కూల్చి వేయడం జరుగుతుందని తమను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండి పడుతున్నారు. తమకు నివాసానికి అనువైన ప్రదేశాన్ని కానీ లేదా సింగిల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయిస్తే తానే ఖాళీ చేసి వెళ్లడం జరుగుతుందని తెలిపారు. వెంటనే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున ఎలాంటి ధర్నాలు చేయడం చట్టరీత్యా నేరమని అధికారుల వద్ద సమస్య పరిష్కరించు కోవాలని మహిళలకు సర్ది చెప్పి పంపించారు.

About The Author