గ్రామాల్లో సమస్యలు పరిష్కరించండి..
- శీలంశెట్టి, జనసేన
పోరుమామిళ్ల : ( AP )
పోరుమామిళ్ల మండలం సంచర్ల పంచాయతీలోని రామేశ్వరం గ్రామం, సంచర్ల గ్రామ కాలనీల్లో వీధిలైట్లు చాలా కాలంగా పనిచేయడం లేదని, ఈ సమస్యను పలుమార్లు పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ఎలాంటి స్పందన లేదని, వెంటనే గ్రామ సమస్యలు పరిష్కరించి వీధిలైట్లు ఏర్పాటు చేయాలని జనసేన మండల అధ్యక్షుడు శీలం శెట్టి లక్ష్మయ్య ఎమ్ పి డి ఓ ఉపేంద్రరెడ్డికి శుక్రవారం వినతిపత్రం అందించారు.
వీధిలైట్లు లేకపోవడంవల్ల గ్రామ ప్రజలు రాత్రి సమయంలో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు రాత్రివేళ బయటకు రావడానికి భయపడుతున్నారని తెలిపారు. అదేవిధంగా, దొంగతనాలు, పాములు, ఇతర ప్రమాదాలు సంభవించే అవకాశమూ ఉందని అన్నారు. తిమ్మారెడ్డి పల్లె (పంచాయతీ) తోకల పల్లె గ్రామంలో గత నెల రోజులుగా ఇంటింటి చెత్తను కూడా సేకరించడం లేదని అన్నారు. పంచాయతీ ఈఓ దృష్టికి తీసుకుపోయినా ఏ మాత్రం సందన లేదు అన్నారు.
ఇంకా ఇతర పంచాయతీలలో కూడా ఇలాంటి సమస్య అనేకములు ఉన్నాయని గ్రామ ప్రజల తరపున ఎమ్పిడిఓకు వినతిపత్రం సమర్పించారు. ఈపంచాయతీలలో వీధిలైట్లు తక్షణమే మరమ్మతులు చేసి ప్రజలకు సౌకర్యం కల్పించాలని శీలం శెట్టి కోరారు.