
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి టిపిసిసి వద్ద పోటీ చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ జిల్లాలోని కాంగ్రెస్ కార్యకర్తల ఆకాంక్షలకు, అభిప్రాయాలకు న్యాయం చేయాలని, పార్టీ బలోపేతానికి నిస్వార్థంగా కృషి చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీలో 2008 నుంచి 2014 వరకు యూత్ కాంగ్రెస్ లోపని చేయడం జరిగింది. 2021 లో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులుగా పనిచేసి పార్టీకి సేవలందించే క్రమంలో నన్ను గుర్తించిన పార్టీ నాకు భూపాలపల్లి కాంగ్రెస్ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అవకాశం కల్పించడం జరిగింది. ప్రతిపక్షాలు నాపై చాలా కేసులు పెట్టాయి. మా పార్టీ జెండా పట్టుకున్న పార్టీ కార్యకర్తలకు నేను మద్దతుగా నిలిచాను. ప్రస్తుత ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు నేతృత్వంలో భూపాలపల్లిలో నిర్వహించిన పాదయాత్రలో, బహిరంగ సభలో అప్పటి బిఆర్ఎస్ ఎమ్మెల్యే గుడ్డు, టమాటాల దాడి చేయించినప్పుడు అడ్డుకోవడం జరిగింది ఆ సంఘటన తర్వాత నాపై 2రెండు తప్పుడు అక్రమ కేసులు బనాయించారు. దీని వలన నేను చాలా ఇబ్బంది పడ్డాను.
ఈ విదంగా కాంగ్రెస్ పార్టీలో వివిధ స్థాయిలలో పనిచేసిన అనుభవం కలిగి ఉన్నానని పార్టీ సిద్ధాంతాల పట్ల నాకు గాఢమైన నమ్మకం ఉందని తెలిపారు. పార్టీని గ్రామ స్థాయిలో నుండి జిల్లా స్థాయివరకు మరింత బలోపేతం చేసి, యువత, మహిళలు, కార్మికులు, రైతులు సహా అన్ని వర్గాలను పార్టీలో చేర్చడం ద్వారా మళ్ళీ కాంగ్రెస్ ప్రభావాన్ని నెలకొల్పేందుకు ప్రణాళికా బద్ధంగా పని చేయాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు.
ఈ బాధ్యతను నా మీద వేయాలని కోరుతూ జిల్లా నిబద్ధ కార్యకర్తలు, నాయకులు, మరియు పెద్దల ఆశీర్వాదం కోరుతున్నాను.జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయాలనే నా అభ్యర్థిత్వాన్ని ప్రజాస్వామ్యపరంగా పరిశీలించి, తగిన మద్దతును ఇవ్వాలని కోరుతున్నాను.