బ్రతుకు ఈడ్చలేక భోరుమంటున్న బడిపంతుళ్ళు..
స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్
- తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల సమస్యలు ఎన్నెన్నో..
- సింగల్ టీచర్ల వ్యర్థాలు అన్నీ ఇన్నీ కావు..
- బదిలీల ప్రక్రియలో బలైపోతున్న టీచర్ల కుటుంబాలు..
- ప్రభుత్వ ఉపాధ్యాయులపై నిర్లక్ష వైఖరి..
- ప్రభుత్వ పాఠశాలలను గాలికోరిలేస్తున్న దౌర్భాగ్యం..
- 70, 80 మంది విద్యార్థులకు ఒకే ఉపాద్యాయుడు..
- చదువు నేర్పించాలా..? వారిని కట్టడి చేయాలా..?
- భావి భారతాన్ని కార్పొరేట్ వలయంలో పడేస్తున్న సర్కార్..
- విద్యలేనివాడు వింతపశువు అంటారు..
- విద్య కొనలేనివాడు వేస్ట్ ఫెలో అంటున్నారు ఇప్పుడు..
- జీతం తీసుకుంటూ విధులు నిర్వహించలేకపోతున్నామంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు..
- ఈ వైఖరి మారకపోతే పిల్లల భవిష్యత్ అంధకారం అవుతుందని హెచ్చరిస్తున్న " ఫోరం ఫార్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..
బ్రతకలేక బడిపంతులు అనేవాళ్ళు పూర్వాశ్రమంలో.. బ్రతుకు ఎలా ఈడ్చాలో అర్ధం కావడం లేదంటున్నారు ఈనాటి ఉపాధ్యాయులు.. ప్రభుత్వ ఉపాధ్యాయుల వ్యథలు అన్నీ ఇన్నీ కావు.. బదిలీలు, ఏకోపాధ్యాయ పాఠశాలలు.. స్థానిక రాజకీయ నాయకుల జులుం.. ఉపాధ్యాయ వృత్తి కాకుండా ఇంకా అనేకానేక బాధ్యతలు నిర్వహించాల్సి రావడం.. తాము ఒకచోట, భార్యా పిల్లలు ఒకచోట.. ఇలా ఒక్కటికాదు రెండుకాదు.. ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వ ఉపాధ్యాయుల జీవితాలు ఆగమాగం అవుతున్నాయి.. వీరి సమస్యలను పట్టించుకునే వారు లేరు.. ఇక ప్రైవేట్ ఉపాధ్యాయుల సంగతి చెప్పనక్కరలేదు.. జీతం తక్కువ, యాతం ఎక్కువ.. ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు ఊడుతుందో తెలియని ఉద్యోగాలు.. మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయుల దుర్భర జీవితం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది.. భావి భారత పౌరులను తయారుచేయడం మాట అటుంచి.. తమ భవితవ్యం ఏమవుతుందో అన్న భయంతో క్షణమొక యుగంలా గడుపుతున్నారు.. పాఠాలు నేర్పే ఉపాద్యాయుడు ప్రభుత్వ పాపపు పాలనలో అల్లాడిపోతున్నాడు..
ఏకోపాధ్యాయ పాఠశాలలలో ఉపాధ్యాయుల లోపం.. బహుళ సబ్జెక్టులు బోధించాల్సిన బాధ్యత. ప్రాథమిక పాఠశాలల్లో తరగతి గదులు, ఉపాధ్యాయులు కొరత. ఇక విద్యార్థుల సంఖ్య తగ్గడం, పాఠశాలల మూసివేతలు ఉదాహరణకు నల్లగొండ జిల్లాలో 298 పాఠశాలలు మూసివేతకు గురైయ్యాయి.. సర్దుబాటు విధానాల్లో అనాలోచిత చర్యలు, విద్యార్థులకు తీవ్ర నష్టం కలుగజేస్తున్నాయి.. విద్యాశాఖ దృష్టి పెట్టకపోవడం.. మౌలిక సదుపాయాలు లేకపోవడం..
ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ఒక్కోసారి 5-6 సబ్జెక్టులు బోధించాల్సి వస్తుంది. ఈ కారణంగా విద్యా ప్రమాణాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ప్రాథమిక విద్యా రంగం ఇలాంటి పరిస్థితులతో చాలా ఇబ్బందుల్లో పడింది. కాగా గత బీఆర్‌ఎస్ సర్కార్ సమయానికి మౌలిక సదుపాయాల పట్ల చక్కటి పథకాలు తీసుకుని వచ్చింది.. ఉదాహరణకు మన ఊరు..మన బడి.. కానీ ఆ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసింది. అలాగే కొత్త భవనాలు నిర్మాణంలో తోడ్పాటు లేకపోవడం, పాత భవనాలు మరమ్మతులు చేయకపోవడం జరుగుతోంది..
ఉపాధ్యాయ సమస్యలపై దృష్టి పెట్టడం లేదు.. సర్దుబాటు విధానాలు ఉపాధ్యాయ, విద్యార్థుల అవసరాలకు తగినంతగా లేకపోవడం దురదృష్టం.. విద్యా ప్రమాణాలు పెంచుకునేందుకు అధికారులు, ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు.. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోకపోతే, గ్రామీణ ప్రాంతాల్లో బాలబాలికల విద్యాప్రమాణాలు ప్రమాదంలో పడతాయి..
ఉపాధ్యాయ అవసరాలకు తగిన పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు విశ్లేషకులు :
ఉపాధ్యాయులకు సరైన భూమిక అంటే బాధ్యతలు కేటాయించడం.. ఏకోపాధ్యాయ పాఠశాలల సమస్యను తగ్గించేందుకు ప్రతి పాఠశాలకు తగిన సంఖ్యలో ప్రత్యేక సబ్జెక్టులు బోధించే ఉపాధ్యాయులను నియమించడం అవసరం. ఒక్కో ఉపాధ్యాయుడిపై ఒత్తిడి తగ్గించి, పనిభారం సమంగా పంపిణీ చేయాలి.
ఇక పాఠశాలల భవనాలు, తరగతి గదులు, విద్యా సామగ్రి వంటి మౌలిక వసతులను మెరుగుపరచడం ఖచ్చితంగా చేయాలి... మరమ్మతులు చేయడం వెంటనే చేపట్టాలి.. ప్రభుత్వ పథకాలు మరింత వేగంగా అమలు చేయాల్సి ఉంది. ఉపాధ్యాయుల కొరకు నిరంతర వృత్తి అభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, వారిని కొత్త బోధన పద్ధతులకు అనుగుణంగా సిద్ధం చేయడం అవసరం. ఉపాధ్యాయులకు హౌసింగ్ అలవెన్సులు, పాత పెన్షన్ విధాన పునరావృతము, బోధన వేతనాలు సమర్థవంతంగా ఉండే విధంగా¸ ఉపాధ్యాయుల సంరక్షణ జరగాలి. ఉపాధ్యాయుల బర్న్ అవుట్ సమస్యలను తగ్గించేందుకు మానసిక, భావోద్వేగ సహాయం అందించడం, సమయం సరిపడా పని, విశ్రాంతి ఇవ్వడం ముఖ్యం. విద్యాశాఖలో ఉపాధ్యాయుల సమస్యలు ప్రతిబింబించే విధంగా మద్దతు చర్యలు, ఫిర్యాదుల పరిష్కారం, సరైన సర్దుబాటు విధానం అమలు చేయాలి. ఈ పరిష్కారాలు తీసుకుంటే ఉపాధ్యాయుల సామర్థ్యం, విద్యా ప్రమాణాలు మెరుగుపడటం మాత్రం కాకుండా విద్యార్థులకు కూడా ఎంతో మేలు జరుగుతుంది..
విద్యార్థులకు కొత్త కాన్సెప్ట్‌లు నేర్పేటప్పుడు మొదట ఎక్కువ శ్రద్ధ చూపాలి.. తర్వాత దాని స్థాయిని తగ్గిస్తూ విద్యార్థులు వారంతట వారే స్వతంత్రంగా నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచడం చేయాలి.. ఇది క్లాస్‌రూమ్ బోధనలో ఒక ముఖ్యమైన పద్ధతి. విద్యార్థులను ప్రోత్సహించేలా క్విజ్ కార్యక్రమాలు.. చర్చలు.. పాత్ర పోషణ.. డిబేట్లు.. సర్వేలు వంటి ఆహ్లాదకరమైన కార్యకలాపాలు నిర్వహించడం చేయాలి అప్పుడు వారు ఎంతో చురుగ్గా తయారవుతారు..
తరగతి గది నియమాలను ఏర్పరచడం.. ఉపాధ్యాయుడు విద్యార్థుల మధ్య పరస్పర భావాలను మెరుగుపరచడం చేయాలి.. ఇక తల్లిదండ్రుల భాగస్వామ్యంతో మంచితీరును ప్రోత్సహించడం చేయాలి.. గూగుల్ క్లాస్ రూమ్స్, ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విద్యార్థులు తమను తాము తీర్చిదిద్దుకునేలా చేయాలి.. వీటితో ఉపాధ్యాయులు కూడా మెరుగైన పాఠ్య నిర్వహణ సాధిస్తారు. నిరంతర వృత్తి శిక్షణ, ప్రగతి పర్యవేక్షణ జరగాలి..
ఇక తెలంగాణలో ఉపాధ్యాయ బదిలీల విషయంలో చాలా తప్పొప్పులు జరిగాయన్నది విదితమే.. నిర్లక్ష్య పద్ధతి, కొంతవరకు అస్పష్ట విధానాలను ప్రభుత్వం అనుసరించింది.. ఉపాధ్యాయుల బదిలీలు కొన్ని సందర్భాల్లో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తక్షణమే నిర్ణయించబడటంతో, ఉపాధ్యాయులకు న్యాయమైన అవకాశాలు, వాస్తవ పరిస్థితుల పూర్వపరిశీలన లేకపోవడం ఇన్నో సమసయ్లు ఎదురయ్యాయి.. కొన్ని ఉపాధ్యాయుల బదిలీలు అనూహ్యంగా, సరైన సమన్వయం లేకుండా, ప్రగతి, కుటుంబ అవసరాలు, స్థానిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకోకుండా జరిగాయన్నది ఆరోపణ..
ప్రభుత్వం, విద్యాశాఖ బదిలీలకు సంబంధించిన లోతైన మార్గదర్శకాలు, పారదర్శక విధానాలు లేకుండా పోవడం వలన ఉపాధ్యాయుల్లో అసంతృప్తిని పెంపొందిస్తోంది. ఉపాధ్యాయుల సంఘాలు, వృత్తి ఒత్తిడి కారణంగా నిరసనలు, ఆందోళనలు కూడా జరుగుతున్నాయి.. ఈ పద్ధతి వల్ల ఉపాధ్యాయుల పనితీరు, విద్యార్థుల విద్యాభ్యాసం కూడా ప్రభావితమవుతుంది. బదిలీలలో అస్తవ్యస్తత, నమూనా లేమి కారణంగా ఉపాధ్యాయుల మధ్య అనైతికత, ప్రభుత్వ పట్ల అవగాహన లోపం పెరుగుతుంది.
కొన్ని పరిష్కార సూచనలు :
బదిలీలను సమగ్ర పరిశీలన కలిగి సుసమావేశం, పారదర్శక విధానాలతో జరపాలి. ఉపాధ్యాయుల వ్యక్తిగత, కుటుంబ, వృత్తి పరిస్థితులను పరిగణలోకి తీసుకుని చర్యలు తీసుకోవాలి. శిక్షణ, ఆర్థిక, మానసిక మద్దతుతో బదిలీల నష్టాలను తగ్గించాలి. ఉపాధ్యాయుల సంఘాల సహకారంతో బదిలీల విధానాలపై శాశ్వత చర్చలు, సూచనలు తీసుకోవాలి. ఈ విధంగా బదిలీల నియంత్రణ ప్రభుత్వ విధానంగా దిశాబోధకంగా మారడం అవసరం.. పారదర్శక, న్యాయమైన బదిలీ విధానం అమలు చేసి తీరాలి.. అక్రమ బదిలీలు నిలిపివేయడం, బదిలీల ప్రక్రియలో అవినీతిని నివారించడం అవసరం అని సూచిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..