వీరి జీవితాల్లో వెలుగు అనేది లేదా..?

స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్

- వ్యథలతో సాగుతున్న జీ.హెచ్.ఎం.సి. పారిశుధ్య కార్మికుల జీవితం.. 
- కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం.. 
- చాలీ చాలని జీతాలతో.. పై అధికారుల జులుంతో క్షణ క్షణం నరకయాతన.. 
- మురికి కూపాలతో నిత్యం పోరాడుతుంటారు.. 
- అత్యంత దారుణమైన జీవన స్థితి గతులు.. 
- తమ ఆరోగ్యాలను ఫణంగా పెట్టి నగరవాసులకు శుభ్రతను అందిస్తారు.. 
- కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తుంటారు.. కనీస వేతనం కూడా దొరకని దారిద్రం.. 
- పైగా కష్టపడి సంపాదించిన డబ్బుల్లో కొంత పై వాళ్లకు చెల్లించాల్సిందే.. 
- చెప్పుకోవడానికి ఎడారి లేక, చావలేక బ్రతుకుతున్న శ్రమజీవులు.. 
- పారిశుధ్య కార్మికుల జీవితాలపై " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ వారందిసున్న పరిశోధనాత్మక కథనం ".. 

WhatsApp Image 2025-10-13 at 5.07.49 PM (1)

మనం తెల్లారి లేవగానే పరిశుభ్రమైన రోడ్లను చూస్తాం.. చిరు చీకట్లు ఇంకా పరుచుకున్న వేల నగర జీవనం మొదలవుతుంది.. శుభ్రంగా వున్న రోడ్లపై జీవన యానాన్ని సాగిస్తుంటాం.. అలాంటి క్లీన్ అండ్ గ్రీన్ వాతావరణాన్ని మనకు అందించడానికి కొన్ని వేలమంది కార్మికులు ముందురోజు రాత్రంతా శ్రమిస్తారు..  నిద్రాహారాలు మానుకుని పనిచేస్తారు. ఈ కార్మికుల్లో అన్ని వయసులవారుంటారు.. ఒక్కోసారి రాత్రుళ్ళు ప్రమాదాలు కూడా జరుగుతాయి.. ప్రాణాలు పోగొట్టుకున్న కార్మికులు కూడా ఎందరో ఉన్నారు.. వీరికి ప్రభుత్వం తరఫునుంచి ఎలాంటి ఇన్సూరెన్స్ పథకాలు కూడా లభించవు.. పైగా వీరిని అజమాయిషీ చేసే అధికారులు అత్యంత క్రూరంగా ఉంటారు .. ప్రతినెలా వేళ్ళకు వచ్చే  అత్యంత తక్కువ జీతంలో ఒక్క వెయ్యి నుంచి రెండువేల రూపాయల వరకు వసూలు చేస్తారు.. వినని వాళ్ళని వుద్యోగం నుంచి తీసిపడేస్తారు..  లేనిపోని అబాండాలు మోపుతారు.. ఉన్న వుద్యోగం పోతుందనే భయంతో కార్మికులు తప్పనిసరి పరిస్థితుల్లో  లంచాలు ఇస్తుంటారు.. ఇక ఈ కార్మికుల్లో మహిళలు అధికంగా పనిచేస్తుంటారు.. వారిలో అందమైన వాళ్ళు కనిపిస్తే చాలు వారికి ఇక లైంగిక వేధింపులు కూడా ఎదురైనా సందర్భాలు అనేకం ఉన్నాయి.. వీరి గురించి, వీరి సంక్షేమం గురించి పట్టించుకునే అధికారి గానీ, నాయకుడు కానీ లేకపోవడం దురదృష్టకరం.. ప్రతి నిత్యం ప్రమాదాల మధ్యలో బ్రతుకుతున్న వీరి జీవితాలు బాగుపడాలని ఉద్దేశ్యంతో ఒక కార్యాచరణ రూపొందిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ ".. 

Read More కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష రేసులో పిప్పాల రాజేందర్

 హైదరాబాద్ మహానగరంలో పారిశుధ్య కార్మికులు అంటే శానిటేషన్ వర్కర్స్ ఈ నగరాన్ని శుభ్రంగా ఉంచేందుకు రోజు పొద్దున్నే పని ప్రారంభిస్తారు. చెత్త, మురికి, కాలువలతో వారు నిత్యం పోరాడుతుంటారు. కానీ వారి జీవన పరిస్థితులు మాత్రం అత్యంత దారుణంగా ఉన్నాయి.

Read More యథా విధిగా ప్రజావాణి కార్యక్రమం..

వాళ్లు ఎదుర్కొంటున్న కష్టాలు :

Read More ఘనంగా శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి జన్మదిన వేడుకలు

చాలీ చాలని అల్ప వేతనంతో వీరు బ్రతుకునీడుస్తున్నారు.. చాలా మంది కాంట్రాక్ట్‌ ఆధారంగా పనిచేస్తున్నారు. వారానికి 6 రోజులు పనిచేసినా, కనీస వేతనం కూడా అందడం లేదు.

Read More బాణాసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి

వారు సురక్ష్యంగా ఉండటానికి, ఉంచడానికి తగిన పరికరాలు లేవన్నది వాస్తవం.. గ్లవ్స్, మాస్క్, బూట్లు లాంటి భద్రతా పరికరాలు లేకుండా పని చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఇక ఎప్పుడైనా అనారోగ్యం పాలైతే వైద్య సదుపాయాలు తగినంతగా ఉండటం లేదు.. తాము సహజీవనం చేస్తున్న చెత్తలో రసాయనాలు, సూక్ష్మక్రిములు, దుర్వాసనల వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, చర్మ సమస్యలు తలెత్తుతున్నాయి.

Read More ప్రతి పాత్రికేయునికి ఇళ్లు,ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

ఇదొక సమస్య అయితే సమాజం నుండి అవమానాలు ఎదురవుతూ ఉంటాయి.. చాలా చోట్ల వారిని ‘తక్కువ స్థాయి పని చేసే వాళ్లు’ అన్న దృష్టితో చూస్తున్నారు. ఇది వారి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఎప్పుడైనా అధిక సమయం పనిచేయాల్సి వస్తుంది.. కానీ ఓవర్ టైమ్‌కు చెల్లింపు లేదు: పండుగలు, వర్షాలు, ప్రళయ సమయంలోనూ వారు పని చేస్తారు.. కానీ అదనపు భత్యం అనేది కలలో కూడా ఉండదు.. వాళ్లు మోసపోతున్న విధానం చూస్తే హృదయం ద్రవిస్తుంది.. 

Read More ఉత్తుత్తి సవాల్.. ప్రయోజనం నిల్..

కాంట్రాక్టర్ల దోపిడి :
ప్రభుత్వం కేటాయించిన జీతం మొత్తాన్ని కాంట్రాక్టర్లు పూర్తిగా వారికి ఇవ్వడం లేదు. కొంత భాగం “కట్” చేస్తారు.

Read More రూ. 251 కోట్ల‌తో వనదేవతల ఆల‌యాభివృద్ది పనులు

హాజరు లెక్కల్లో మోసం :
హాజరు రిజిస్టర్లలో తప్పుడు లెక్కలు వేసి వేతనాలు తగ్గించడం సాధారణంగా జరుగుతోంది.

Read More పాండవుల గుహలను సందర్శించిన వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్స్

తాత్కాలిక నియామకాలు :
సంవత్సరాల తరబడి “తాత్కాలిక సిబ్బంది”గా ఉంచి, శాశ్వత ఉద్యోగ హక్కులు ఇవ్వడం లేదు.

Read More తెలంగాణ రాజ్యాధికార పార్టీ TRP ఆధ్వర్యంలో స్టార్ చిల్డ్రన్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం

అవినీతి సిబ్బందికి  లంచాలు :
కొందరు సూపర్‌వైజర్లు, కాంట్రాక్టర్లు వేతనం ఇవ్వడానికి కూడా “కమిషన్” తీసుకుంటున్నారు. లీవ్ కావాలన్నా, షిఫ్ట్ మార్పు కావాలన్నా, చిన్న చిన్న సౌకర్యాలకూ లంచాలు తీసుకుంటున్నారని కార్మికులు కన్నీటి పర్యంతం అవుతున్నారు..  ఇక పనికి హాజరుకాకుండా వేతనం తీసుకునే “గోస్ట్ వర్కర్లు” పేరుతో నకిలీ హాజర్లు కూడా నమోదవుతున్నాయి.

Read More ప్రజావాణి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలి

కాగా దీని పర్యవసానం అత్యంత దారుణంగా ఉంటోంది.. కార్మికుల్లో ఆత్మవిశ్వాసం తగ్గిపోతోంది. ఆరోగ్య సమస్యలతో చిన్న వయసులోనే మరణాలు సంభవిస్తున్నాయి..  నగర పరిశుభ్రత కూడా దెబ్బతింటోంది. ప్రభుత్వం పేరు చెడిపోతోంది.

విశ్లేషకులు కొన్ని పరిష్కార మార్గాలు సూచిస్తున్నారు.. కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి శాశ్వత నియామకాలు చేపట్టాలి.. వేతనాలు నేరుగా కార్మికుల ఖాతాలకు జమ చేయాలి.. మధ్యవర్తులను తొలగించాలి.. సురక్షా పరికరాలు, వైద్య బీమా తప్పనిసరిగా చేయించాలి.. ఇక ఖచ్చితంగా డిజిటల్ హాజరు సిస్టమ్‌తో పారదర్శకత తీసుకురావాలి..  స్వచ్ఛభారత్, స్వచ్ఛహైదరాబాద్ నిధుల వినియోగంపై కఠిన ఆడిట్ నిర్వహించాలి..  అవినీతి ఫిర్యాదుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలి..  పారిశుధ్య కార్మికులకు సామాజిక గౌరవం పెంచే అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.. 

చివరగా..  జీ.హెచ్.ఎం.సి. పారిశుధ్య కార్మికులు నగరానికి వెన్నెముక వంటివారు. వారి కష్టాలు గుర్తించి, వారి జీవితాన్ని గౌరవప్రదంగా మార్చడం ప్రభుత్వం, సమాజం ఈ రెండింటి బాధ్యత.. ఇటు సమాజానికి, అటు ప్రభుత్వానికి వారి బాధ్యతలు తెలియజేసేందుకు అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..

About The Author