
భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామంలో స్టార్ చిల్డ్రన్ అండ్ జనరల్ హాస్పిటల్ మరియు తెలంగాణ రాజ్యాధికార పార్టీ TRP ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది
స్టార్ హాస్పిటల్ వారు జనరల్ ఫిజీషియన్ పీడియాట్రిషన్ ఇద్దరు డాక్టర్లు గ్రామంలోని ప్రజలను పరీక్షించి వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి పిల్లలకు పెద్దలకు చూసి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది స్టార్ హాస్పిటల్ యాజమాన్యం ఇంకేదైనా గ్రామంలో మమ్మల్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ని సంప్రదిస్తే ప్రతి ఊర్లో కూడా క్యాంపులు ఏర్పాటు చేసి ఉచితంగా వైద్యంతోపాటు మందులు కూడా అందిస్తామని యాజమాన్యం ప్రకటించారు..
అనంతరం తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా నాయకులు రవి పటేల్ మాట్లాడుతూ స్టార్ హాస్పిటల్స్ వారు చేస్తున్న ఈ మంచి పనిలో మేము కూడా భాగస్వామ్యం అయినందుకు సంతోషంగా ఉందని మా TRP పార్టీ ఎజెండాలోని వైద్యం అనే అంశం నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు తోడ్పాటు అందిస్తుందని ప్రజలకు మరింత చేరువడం ప్రజలలో మమేకమై వారి సమస్యలు ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం మా బాధ్యతగా భావించి ఈ యొక్క మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వాములు చేసినందుకు సహకరించినందుకు గ్రామ ప్రజలకు స్టార్ హాస్పటల్ వారికి కృతజ్ఞతలు తెలియజేసిన రవి పటేల్ ఈ కార్యక్రమంలో జిల్లా TRP పార్టీ నేతలు గ్రామ కార్యకర్తలు పాల్గొన్నారు..