అధిష్టానం నిర్ణయమే ఫైనల్..

సంగారెడ్డి :

* జిల్లా అధ్యక్షుడు గా ఎవరిని నియమించిన కలిసి పనిచేస్తాం..
* పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం..
* నీలం మధు ముదిరాజ్..
* బూత్, బ్లాక్ స్థాయిలో అభిప్రాయ సేకరణ..
* సంగారెడ్డిలో ఏఐసీసి అబ్జర్వర్  మీడియా సమావేశం, అభిప్రాయ సేకరణ..

WhatsApp Image 2025-10-12 at 6.02.19 PM

డీసీసీ అధ్యక్షుడిగా అధిష్టానం ఎవరిని నియమించిన వారితో కలిసి పనిచేస్తామని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. సంగారెడ్డి  జిల్లా కేంద్రంలోనీ రెడ్లస్ ఇన్ బాంక్వెట్ హాల్ లో  ఆదివారం డిసిసి అధ్యక్షుడి ఎంపికకు సంబంధించి ఏఐసీసీ సెక్రటరీ, సంగారెడ్డి అబ్జర్వర్ సజరిట లైత్ ప్లాంగ్  ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశం మరియు అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ సురేష్ షెట్కర్, పీసీసీ అబ్జర్వర్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావు,మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, సంగారెడ్డి డిసిసి అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి, వివిధ కార్పోరేషన్ల చైర్మన్ లతో కలసి నీలం మధు పాల్గొన్నారు. 

Read More ఘనంగా శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి జన్మదిన వేడుకలు

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  అన్ని రాష్ట్రాల్లో ఏఐసీసీ ఆదేశాల మేరకు డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం ప్రత్యేక అబ్జర్వర్లను నియమించి అభిప్రాయ సేకరణ జరుపుతున్నారని తెలిపారు. కార్యకర్తల అభీష్టం మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించిన సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. బ్లాక్ స్థాయిలో నేతల అభిప్రాయంతో పాటు నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు నిర్వహించి అందరి అభిప్రాయం తీసుకుని ఏఐసీసీ కి అందచేస్తారని పేర్కొన్నారు అక్కడ ఏఐసీసీ అగ్రనాయకులు అన్ని కోణాల్లో ఆలోచించి అధ్యక్షుడి నియామకం పై నిర్ణయం తీసుకుంటారని వివరించారు. కింది స్థాయిలో నాయకులు కార్యకర్తల అభిప్రాయం మేరకు అధ్యక్షుడిని నిర్ణయించడం శుభ పరిణామమన్నారు.

Read More ఉత్తుత్తి సవాల్.. ప్రయోజనం నిల్..

సంగారెడ్డి డిసిసి అధ్యక్షుడిగా ఎవరిని నియమించిన సంపూర్ణ సహకారం అందించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వివిధ నియోజకవర్గాల ఇంచార్జీలు, మండల, టౌన్ మరియు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.. 

Read More నేటి భారతం :

About The Author