జిల్లా రిజిస్ట్రార్‌ గా శగుఫ్తా ఫిర్దోస్

- శుభాకాంక్షలు తెలిపిన యునైటెడ్ టీం.రాష్ట్ర అధ్యక్షులు నిస్సార్ అహ్మద్.

ఉమ్మడి కరీంనగర్ జిల్లా : 

WhatsApp Image 2025-10-14 at 7.08.37 PM

టిజిపిఎస్ సి గ్రూప్ –I సర్వీసెస్ లో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్‌గా మంగళవారం శగుఫ్తా ఫిర్దోస్ ఎంపికయ్యారు.ఈ సందర్భంగా యునైటెడ్ టీం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు షేక్ నిసార్ అహ్మద్ హర్షం  వ్యక్తం చేసి,శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీ విజయం కృషి, ప్రతిభ, శక్తివంతమైన స్ఫూర్తికి అద్దం పడుతున్నట్లు నిలుస్తుందన్నారు. ఈ గొప్ప సాధనతో మీరు మైనారిటీ ఉద్యోగుల సమాజానికి గర్వకారణమయ్యారని,మీ ప్రయాణం ఎందరికో మార్గదర్శకంగా నిలవాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో యునైటెడ్ టీమ్ బషీర్ హుస్సేన్, మొహమ్మద్ జావీద్, ఆయేషా ముంతాజ్, షారుఖ్ ఖాన్, ముజీబ్ అయ్యూబ్, ఎహ్తేశాం ఉల్ హక్ సామాజిక కార్యకర్తలు, తదితర సభ్యులు పాల్గొన్నారు.

Read More నేటి భారతం :

About The Author