బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందే..

జయశంకర్ భూపాలపల్లి జిల్లా : 

- టిఆర్పీ జిల్లా నాయకుడు రవి పటేల్..
- భూపాలపల్లిలో ధర్నా, రాస్తారోకో..
- లీడర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. 

WhatsApp Image 2025-10-10 at 4.10.19 PM

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి తీరాల్సిందేనని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టిఆర్పీ)జిల్లా నాయకుడు రవి పటేల్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్త బంద్ లో భాగంగా పార్టీ జిల్లా నాయకులు రవి పటేల్ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా, రాస్తారోకో చేశారు. అంతకుముందు నాయకులు, కార్యకర్తలు కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ వద్ద ప్రధాన రహదారిపై ధర్నా చేస్తున్న విషయాన్ని గమనించిన ఎస్సై సాంబమూర్తి ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తమ సిబ్బందితో వెళ్లి ధర్నా చేస్తున్న నాయకులను బలవంతంగా లాక్కెళ్లి, అదుపులోకి తీసుకుని వదిలేశారు. 

Read More కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష రేసులో పిప్పాల రాజేందర్

ధర్నా సందర్భంగా టిఆర్పీ జిల్లా నాయకుడు రవి పటేల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలను అణిచివేయడానికి పెద్ద మొత్తంలో పోలీసులను మోహరించి ఉద్యమాన్ని అణిచివేసే విధంగా కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఏం జరిగినా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడేది లేదన్నారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇచ్చే వరకు పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపి పార్టీలకు బీసీలపై చిత్తశుద్ధి లేదని, 42 శాతం రిజర్వేషన్లపై అన్ని పార్టీలు తమ ద్వంద వైఖరిని ప్రకటిస్తున్నాయన్నారు. 64శాతం ఉన్న బీసీలు తమ రిజర్వేషన్ల కోసం తెలంగాణ ఉద్యమ తరహాలో మరో ఉద్యమం చేయవలసిన ఆవశ్యకత ఏర్పడిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ 9లో ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాకుండా దొంగ కారణాలు చెప్పి వెనకబడేస్తున్నారని విమర్శించారు. అన్ని పార్టీలకు స్థానిక సంస్థల ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడంలో లేదని, కావున ప్రజలంతా కాంగ్రెస్, బీఆర్ఎస్, బిజెపి నేతలను నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. 
ఈ కార్యక్రమంలో టిఆర్పీ జిల్లా నాయకులు కరుణాకర్, చంద్రశేఖర్, సంతోష్, శ్రీను, వెంకన్న, సమ్మయ్య, నవీన్, అక్షయ్, సన్నీ, శంకర్రావు, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు. 

Read More యథా విధిగా ప్రజావాణి కార్యక్రమం..

About The Author