రైతులకు ఏ సమస్య లేకుండా చూసుకుంటాం
సూర్యాపేట :
ఎటువంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలి
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి
సూర్యాపేట నియోజకవర్గ పరిధిలోగల అన్ని మండలాల రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకుంటామని, అదేవిధంగా రైతులకు కొనుగోలు కేంద్రాలలో ఎలాంటి సమస్యలు ఏర్పడిన తమ దృష్టికి తీసుకురావాలని సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి శుక్రవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు.సూర్యాపేట పరిధిలోని ఐదు మండల ల ప్రభుత్వ ధాన్యం కొనుగోలు నిర్వహకులు కేంద్రాల కు ఎమ్ ఎస్ ఎస్పీ పరికరాలు టర్బాలిన్స్,పాడి క్లీనర్ లు, ఎలక్ట్రానిక్ కాoటలు, మాయిచర్ మీటర్స్ సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు అందుబాటులో ఉన్నాయని వాటిని వినియోగించు కోవాలని తెలిపారు.
మోతె,ఆత్మకూరు (ఎస్) చివ్వెంల,సూర్యాపేట మండలo, పెన్ పహాడ్, మండలా ల ప్రభుత్వ ధాన్యం కొనుగోలు వారికి మాత్రమే ఇవి వర్తిస్తాయని తెలిపారు..