ఎంపీటీసీ, జడ్పిటిసి అభ్యర్థుల ఖరారు పై సమావేశం

సంగారెడ్డి :

- ముఖ్యఅతిథిగా పాల్గొన్న టిపిసిసి ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

WhatsApp Image 2025-10-09 at 6.40.54 PM

రానున్న ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలలో అభ్యర్థుల ఎంపికపై మండల అధ్యక్షులతో గురువారం టీపీసీసీ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మల్కాపూర్ లోని వెంకటేశ్వర గార్డెన్స్ లో పార్టీ మండల అధ్యక్షులతో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీటీసీ, జడ్పిటిసి అభ్యర్థులు నామినేషన్ వేసేలా చూడాలని తెలిపారు. అభ్యర్థుల గెలుపుకు పార్టీ శ్రేణులు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని అన్ని జడ్పిటిసి,ఎంపీటీసీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవాసం చేసుకునేలా దిశా నిర్దేశం చేశారు. అంతిమంగా కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో సదాశివపేట బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రామ్ రెడ్డి సంగారెడ్డి బ్లాక్ ప్రెసిడెంట్ రఘుగౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, ఆయా మండలాధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More యథా విధిగా ప్రజావాణి కార్యక్రమం..

About The Author