పంట మార్పిడి విధానం ద్వారా అధిక దిగుబడిసాధన..

భూపాలపల్లి జిల్లా ప్రతినిధి :

రైతులకు అవగాహన కలిగించిన నీతి ఆయోగ్ ప్రభరి అధికారి శ్రీమతి పౌసమి బసు 

WhatsApp Image 2025-10-09 at 6.37.47 PM

భూపాలపల్లి ఐడిఓసి కార్యాలయంలో ఆకాంక్షిత జిల్లాలో అభివృద్ధి సూచికలపై వైద్య, విద్య, మహిళా మరియు శిశు సంక్షేమం, డి.ఆర్.డీ.ఏ, పశు సంవర్థక శాఖల అంశాలపై సమగ్ర సమీక్ష జరిపారు. జిల్లా కలెక్టర్  రాహుల్ శర్మ సమావేశంలో పాల్గొని వివిధ రంగాల్లో జరుగుతున్న కార్యక్రమాల పురోగతిని వివరించారు.

Read More వీరి జీవితాల్లో వెలుగు అనేది లేదా..?

ప్రభరి అధికారి పౌసమి బసు మాట్లాడుతూ రైతులు పంట మార్పిడి పద్ధతులు అవలంబించడం ద్వారా భూమి సారాన్ని కాపాడుకోవడంతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చని సూచించారు. అలాగే వైద్య, విద్యా రంగాల్లో గుణాత్మక మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

Read More రూ. 251 కోట్ల‌తో వనదేవతల ఆల‌యాభివృద్ది పనులు

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని, ఆ దిశగా అధికారులు కార్యాచరణ కొనసాగించాలని నీతి ఆయోగ్ ప్రభరి అధికారి పౌసమి బసు తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలని, ఆదిశగా కార్యాచరణ కొనసాగించాలని  జిల్లా అధికారులకు సూచించారు. ప్రతి శాఖ నిరంతరం పర్యవేక్షణ, సమగ్ర సమన్వయంతో అభి వృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేయవలసిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం... 10వ తరగతిలో నూరు శాతం ఫలితాలు రావాలి.... ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించాలి.. వెనుకంజలో ఉన్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నందుకు అభినందించారు.
యాస్పిరేషన్ అంశాలల్లో రాష్ట్ర గవర్నర్ నుండి అవార్డు తీసుకోవడం పట్ల అభినందించారు.

Read More ఉత్తుత్తి సవాల్.. ప్రయోజనం నిల్..

ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, జిల్లా వైద్యాధికారి డా మధుసూదన్, మహిళా సిశు సంక్షేమ అధికారి మల్లీశ్వరి, సీపీఓ బాబూరావు, డిఆర్డీఓ బాలకృష్ణ, డీఈఓ రాజేందర్,  పశు వైద్య శాఖ ఏడీ గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Read More నేటి భారతం :

About The Author