విద్యార్థులు చేసే పనిలో పర్ఫెక్ట్‌గా ఉండాలి,

జయశంకర్ భూపాలపల్లి జిల్లా :

- నైపుణ్యం ఉన్నవారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తారంగా ఉంటాయయి 
- జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ 

WhatsApp Image 2025-10-10 at 4.12.51 PM

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆధునాతన సాంకేతిక కేంద్రాన్ని (ATC) ల్యాబ్‌లను, పరికరాలను పరిశీలించి వాటి పని విధానాన్ని వివరంగా అడిగి తెలుసుకున్న జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ 

Read More నేటి భారతం :

అనంతరం కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ.. ఆధునాతన పరికరాలు ఏర్పాటు చేసినందున వాటిని సమర్థంగా ఉపయోగించి నైపుణ్యం సాధించాలని విద్యార్థులకు సూచించారు. తరగతి గదులను సందర్శించిన కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు. క్రమం తప్పక కళాశాలకు హాజరు కావాలని, ఎంపిక చేసుకున్న కోర్సుల్లో చక్కటి నైపుణ్యం సాధించాలని సూచించారు.  

Read More శబరిమలలో చోరీపై కేంద్రం జోక్యం చేసుకోవాలి

ప్రిన్సిపల్ జూమ్లా నాయక్ కలెక్టర్‌కు ఏటీసీలో ఒక సంవత్సరం, రెండు సంవత్సరాల వ్యవధిలో 6 కోర్సులు అందుబాటులో ఉన్నాయని, మొత్తం 244 మంది విద్యార్థులు నమోదు చేసుకునే అవకాశం ఉండగా ఇప్పటివరకు 172 మంది విద్యార్థులు నమోదు అయ్యారని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూమ్లా నాయక్, కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Read More నేటి భారతం :

About The Author