భక్తిశ్రద్ధలతో వాసవి మాత పారాయణం కుంకుమార్చన పూజలు
సంగారెడ్డి :
- అమ్మవారిని దర్శించుకున్న వాసవి మా ఇల్లు అధ్యక్షులు తోపాజీ అనంత కిషన్
సంగారెడ్డి పట్టణంలోని వాసవి మాత ఆలయంలో శుక్రవారం కృష్ణ నక్షత్రం సందర్భంగా వాసవి మాత పారాయణం కుంకుమార్చన పూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ తోపాజి అనంత కిషన్ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన పూజల్లో ఆర్యవైశ్య సోదరులతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో సాంప్రదాయ దుస్తుల్లో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం జరిగిన అమ్మవారి పల్లకి సేవ పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇటీవల దేవీ నవరాత్రి ఉత్సవాల్లో దంపతులచే అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించగా వాటిని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. భక్తుల రాకతో ఆలయ ప్రాంగణాలు కోలాహలంగా మారాయి. దీంతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం చోటుచేసుకుంది.
About The Author
18 Oct 2025