జర్నలిస్టు వెంకటకృష్ణ మృతికి టి జె ఎఫ్ ఘన నివాళి

ఖమ్మం ప్రతినిది:

మంచి మిత్రుని కోల్పోయాం
టీజేఎఫ్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ

 

WhatsApp Image 2025-10-13 at 7.20.41 PM

Read More బాణాసంచా విక్రయాలకు అనుమతి తప్పనిసరి

స్కై లైన్ దినపత్రిక ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్, టి యు డబ్ల్యూ జే టీజేఎఫ్ ఖమ్మం నగర ఉపాధ్యక్షులు వి. వెంకట కృష్ణారావు (50) ఆదివారం రాత్రి తీవ్రమైన గుండె నొప్పితో మృతి చెందారు. గుండె నొప్పి రావడంతో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు వెంకటకృష్ణను ఆస్పత్రికి తరలించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. జర్నలిస్టు వెంకటకృష్ణ మృతి వార్త సమాచారం తెలుసుకున్న తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టీజేఎఫ్) జర్నలిస్టుల బృందం సోమవారం శ్రీనగర్ కాలనీలోని  మృతుని నివాసానికి వెళ్లి వెంకటకృష్ణ భౌతిక కాయం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి ఘన నివాళులు అర్పించారు.

Read More తెలంగాణ రాజ్యాధికార పార్టీ TRP ఆధ్వర్యంలో స్టార్ చిల్డ్రన్ హాస్పిటల్ ఉచిత వైద్య శిబిరం

ఈ సందర్భంగా టీజేఎఫ్ జర్నలిస్ట్  యూనియన్ జిల్లా అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి చిర్రా రవి లు మాట్లాడుతూ... జర్నలిస్టుల సంక్షేమం కోసం జరిగిన అనేక ఆందోళన కార్యక్రమాలలో వెంకటకృష్ణ ముందుండి జర్నలిస్టుల శ్రేయస్సు కోసం చురుకుగ పని చేసిన వ్యక్తి అని, ప్రతి ఒక్కరితో కలివిడిగా ఉంటూ మంచి పేరును సంపాదించుకున్నారని, నిబద్ధత కలిగిన జర్నలిస్టుగా గుర్తింపు పొందిన వెంకటకృష్ణ భౌతికంగా మన మధ్య లేకపోవడం బాధాకరమని అన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు తీవ్ర ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Read More శబరిమలలో చోరీపై కేంద్రం జోక్యం చేసుకోవాలి

జర్నలిస్టు వెంకటకృష్ణ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన వారిలో యూనియన్ జాతీయ కౌన్సిల్ సభ్యులు వెన్నబోయిన సాంబశివరావు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి రజినీకాంత్, సీనియర్ జర్నలిస్టు రామిశెట్టి విజేత, ఉపాధ్యక్షులు వనం నాగయ్య, మందుల ఉపేందర్, టీఎస్ చక్రవర్తి, 6టీవీ స్టాఫ్ రిపోర్టర్ కె . హరీష్ ,ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్ బాబు, కార్యదర్శి కొరకొప్పుల రాంబాబు, కోశాధికారి బిక్కి గోపి, సహాయ కార్యదర్శి మూల జీవన్ రెడ్డి,ఎలక్ట్రానిక్ మీడియా నగర అధ్యక్షులు యల్లమందల  జగదీష్, నగర ప్రధాన కార్యదర్శి అమరవరపు కోటేశ్వరరావు, సంతోష్,పొలాబోయిన శ్రీకాంత్, నాగేశ్వరరావు కోణతాలపల్లి జర్నలిస్టు నాయకులు  కాపర్తి నరేందర్, పానకాలరావు, ఉల్లోజు రమేష్ ,ప్రభాకర్ రెడ్డి, సాయి, మురళి, నరసింహారావు, పి సి డబ్ల్యూ నరేష్, సాక్షి హుస్సేన్, కళ్యాణ్, ఐకాన్ న్యూస్ లక్ష్మణ్, తోట గణేష్, సి కె న్యూస్ ఉపేందర్, ఐజెయు నాయకులు నామ పురుషోత్తం, శీలం శ్రీనివాస్, మేడి రమేష్, నరసయ్య, భరత్, తదితరులు పాల్గొన్నారు.

Read More ఘనంగా శాసన మండలి ప్రతిపక్షనేత సిరికొండ మధుసూదనాచారి జన్మదిన వేడుకలు

About The Author