రూ. 251 కోట్ల‌తో వనదేవతల ఆల‌యాభివృద్ది పనులు

ములుగు జిల్లా ప్రతినిధి:

- మంత్రి పొంగులేటి   శ్రీ‌నివాస‌రెడ్డి.

WhatsApp Image 2025-10-13 at 6.46.53 PM

ములుగు జిల్లా, తాడ్వాయి మండలం మేడారం లోని అశేష భ‌క్తుల కొంగుబంగారం శ్రీ స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ ఆల‌యాభివృద్దికి తెలంగాణ ప్ర‌భుత్వం  251 కోట్ల రూపాయిలు ఖ‌ర్చు చేస్తుందని ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా ఇన్ ఛార్జి రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌ సంబంధాల శాఖ‌ మంత్రి  పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డితెలిపారు.

Read More బ్రతుకు ఈడ్చలేక భోరుమంటున్న బడిపంతుళ్ళు..

సోమ‌వారం ములుగు జిల్లా ఎస్ ఎస్ తాడ్వాయి మండలం మేడారం కు హెలికాప్టర్ లో 12 గంటల 54 నిముషాలకు చేరుకున్న  రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, మహబూబాబాద్, పార్లమెంటు సభ్యుడు బలరాం నాయక్, తో కలిసి మేడారం జాతర అభివృద్ధి పనులను పరిశీలించారు.  ముందుగా జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్.పి. శబరిష్,  ఐటిడిఏ పి ఓ చిత్ర మిశ్రా పుష్ప గుచ్చాలు ఇచ్చి మంత్రులకు ఘన స్వాగతం పలికారు. మేడారం  శ్రీ సమ్మక్క సారలమ్మ అమ్మవార్లను,   దర్శించుకుని మంత్రులు ప్రత్యేక పూజలు చేశారు.

Read More ప్రజావాణి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలి

అనంతరం మంత్రులు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి మంత్రి పొంగులేటి మాట్లాడారు.  90 రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 24 గంటలు  మూడు షిఫ్టుల్లో పనిచేసి నిర్ణీత సమయంలో పనులను పూర్తి చేయాలని  అధికారులకు  సూచించారు.  ప్రకృతి ఒడిలో ఉన్నట్టుగా సమ్మక్క సారలమ్మ ఆలయం అభివృద్ది పనులు చేపట్టాలని అన్నారు. 

Read More శబరిమలలో చోరీపై కేంద్రం జోక్యం చేసుకోవాలి

మంత్రి సీతక్క మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి  శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం మహా జాతర పునరుద్ధరణ అభివృద్ధి పనుల పర్యవేక్షణను జిల్లా ఇంచార్జ్ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కి అందించడం జరిగిందని ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఇన్చార్జ్ మంత్రివర్యులు అమ్మవార్ల పై ఉన్న భక్తి తో ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సజావుగా అమ్మ వాళ్ళ దర్శనం జరగాలని మేడారం శ్రీ సమ్మక్క సారమ్మ జాతర ప్రాముఖ్యత ప్రపంచ నలుమూలలకు వ్యాప్తి చెందాలని ఉద్దేశంతో అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్న ఇన్చార్జ్ మంత్రికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.  మేడారం సమ్మక్క సారమ్మ దేవతల సందర్శనార్థం భక్తుల సంఖ్య రోజుకు పెరుగుతూ వస్తుందని, అభివృద్ధి పనులు అత్యంత వేగంగా నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పూర్తి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సకాలంలో పనులను పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఒకే సమయంలో గుడి నిర్మాణం, అదేవిధంగా జాతర పనుల నిర్వహణ చేయాల్సి ఉంటుందని, అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేయాలని, పనుల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, గద్దెల విస్తరణ లో భాగంగా గ్రామస్తులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయడం లేదని గతంలో అధికారులు దూర దృష్టి లేకపోవడంతో గద్దెల ప్రాంగణంలోనే అన్ని నిర్మాణాలను చేపట్టారని వాటి ద్వారా ఇప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా అధికారులు అలాంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా మాస్టర్ ప్లాన్ ప్రకారమే పనులను పూర్తిచేయాలని అన్నారు.

Read More ఉత్తుత్తి సవాల్.. ప్రయోజనం నిల్..

ఈ సందర్భంగా  మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ మాట్లాడుతూ గతంలో మేడారం జంపన్న వాగుపై వంతెన నిర్మాణం కేవలం 45 రోజులలో పూర్తి చేయడం జరిగిందని అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పనులు కూడా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జాతర పనులను నిరంతరం పర్యవేక్షించడం చాలా సంతోషంగా ఉందని మంత్రులు చేసిన సూచనలను అధికారులు తూచా తప్పకుండా పాటిస్తూ జాతర వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పనులను పూర్తి చేయాలని తెలిపారు.

Read More అధిష్టానం నిర్ణయమే ఫైనల్..

అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల స‌మావేశంలో.... మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 2026 జనవరిలో ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా తెలంగాణ కుంభమేళాగా పేరు ప్రఖ్యాతలు గాంచిన శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతుందని తెలిపారు. 

Read More కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష రేసులో పిప్పాల రాజేందర్

శ్రీ సమ్మక్క సారలమ్మ దేవతలను కోట్లాదిమంది భక్తులు తమ ఇలా వేల్పులుగా పూజిస్తారని దేవతల సందర్శనార్థం వచ్చే భక్తులకు అన్ని విధాలుగా ఎలాంటి లోటు పాట్లు జరగకుండా అత్యంత దగ్గరగా అమ్మవార్లను దర్శించుకోవడం కోసం కావలసిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు.

Read More పాండవుల గుహలను సందర్శించిన వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్స్

మహా జాతర సమీపిస్తున్న నేపథ్యంలో శ్రీ సమ్మక్క సారలమ్మ గద్దెల పునరుద్ధరణ అభివృద్ధి పనులను 90 రోజులలో పూర్తిచేయాలని ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశామని మేడారం అభివృద్ధి పనుల పురోగతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా ఇన్చార్జ్, స్థానిక మంత్రి, జిల్లా అధికారుల నుంచి తెలుసుకుంటున్నారని తెలిపారు. 

Read More ప్రతి పాత్రికేయునికి ఇళ్లు,ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

పునరుద్ధరణ పనుల పర్యవేక్షణలో భాగంగానే ఇక్కడ జరుగుతున్న పనులను పూర్తిస్థాయిలో పర్యవేక్షించడం జరిగిందని కొన్ని విషయాలలో అధికారులకు తగు సూచనలు కూడా చేశామని పేర్కొన్నారు. 

Read More డైసెల్ ల్యాబొరేటరీస్ ను సందర్శించిన గీతం విద్యార్థులు

ఈ సమ్మక్క సారలమ్మ మేడారం మహా జాతర కేవలం రెండు సంవత్సరాలకు ఒకసారి జరిపే జాతర కాకుండా నిరంతరం భక్తులు అమ్మవార్ల సందర్శనార్థం వస్తున్నారని భక్తుల ప్రయోజనాలు అవసరాలు దృష్టిలో ఉంచుకొని ప్రజా ప్రభుత్వం మేడారం ప్రాంతాన్ని శాశ్వత అభివృద్ధి చేయాలని దృఢంగా నిర్ణయం తీసుకున్నామని అన్నారు.
ఇప్పటికే గద్దెల ప్రాంగణాన్ని అభివృద్ధి చేయడం కోసం 101 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందని మరో 71 కోట్ల రూపాయల పనుల కోసం టెండర్లు పిలిచామని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా స్థానిక ఆడబిడ్డలు సమ్మక్క సారలమ్మ సహాయంతో వారి సహకారాలతో విజయవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు.

Read More అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ఏఎస్సై)గా ఉద్యోగన్నతి..

2024 లో జరిగిన జాతరకు విచ్చేసిన భక్తుల సంఖ్య కంటే 2026 జనవరిలో జరిగే మహా జాతరకు వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని వారి అందరి అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని పేర్కొన్నారు.

అనంతరం సాయంత్రం  4 గంటల 30 నిమిషాలకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, మహబూబాబాద్  ఎం.పి.  బలరాం నాయక్ హెలికాప్టర్ ద్వారా హైదరాబాద్కు బయలుదేరారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, ఎస్.పి. శబరిష్, ఐటీడీఏ పి.ఓ. చిత్ర మిశ్రా, డి ఎఫ్ ఓ రాహూల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, ఈ ఎన్ సి, ఆర్డీఓ వెంకటేష్, పూజారులు, జిల్లా అధికారులు, ఆర్కిటెక్చర్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

About The Author