భారత శక్తి చెప్పిందే జరుగుతోందా..?
( స్పెషల్ కరస్పాండెంట్, హైదరాబాద్ )
* ఆర్.టి.సీ. ని అమ్మేందుకు కుట్రలు జరుగుతున్నాయా..?
* ప్రైవేట్ ట్రావెల్స్ కు పట్టం కట్టేందుకు ప్రణాళికలు..!
* ఛార్జీల పెంపుతో ఆర్.టి.సీ. ని సామాన్యులకు దూరం చేసే కుయుక్తులు..
* వేల కోట్ల విలువైన ఆర్.టి.సీ. ఆస్థులను కొట్టేసేందుకు ప్రభుత్వం కంకణం కట్టుకుందా..?
* రక రకాల కారణాలు చెబుతూ ఛార్జీల మోత మోగిస్తున్న దుర్మార్గం..
* నిరుపేదల ప్రయాణ సాధనాన్ని నిర్వీర్యం చేస్తే సహించేది లేదు..
* సజ్జనార్ ని బదిలీ చేసిన వెంటనే కుతంత్రాలకు తెరతీసిన రేవంత్ సర్కార్..
* ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నెన్నో కబుర్లు చెప్పిన వైనం..
* అధికారంలోకి రాగానే అంతులేని అవినీతికి అరంగేట్రం..
* డ్రైవర్ల పోస్టుల భర్తీ అంటూ నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే ఛార్జీల పెంపు అగ్గి రాజేసిన దౌర్భాగ్యం..
* తీవ్ర నిరసనలు తెలుపుతున్న విపక్షాలు..
* సత్వరమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ"..
తెలంగాణ ఆర్టీసీ సంస్థని ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది అన్న అనుమానం వ్యక్తం చేస్తూ భారత శక్తి దినపత్రిక ఇదివరకే ఒక సంచలన కథనాన్ని ప్రచురించిన విషయం విధితమే. ప్రైవేట్ ట్రావెల్స్ కు కొమ్ము కాస్తూ ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టేందుకు భయంకరమైన యత్నం జరుగుతోందని ఆ కథనంలో మేము వెల్లడించాం.. ఇప్పుడు అది నిజమవుతోందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి వినిపిస్తున్నాయి. నిరుపేద సామాన్య ప్రజలకు పుష్పక విమానం లాంటి ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే చార్జీల పెంపు వ్యవహారం.. పెరిగిన చార్జీలను భరించలేక అందరూ ఆర్టీసీపై అసహ్యం ఏర్పరచుకుంటారు.. దీనిని ఒక కారణంగా చూపుతూ ప్రభుత్వం ఆర్టీసీ సంస్థను అమ్మేస్తుంది.. ఆయిల్ రేట్లు పెరిగాయని జీతభత్యాలు ఇవ్వలేకపోతున్నామని ఏవేవో కారణాలు చెబుతూ ఆర్టీసీని అమ్మేసేందుకు కుట్ర జరుగుతోంది అన్నది వాస్తవం.. అంతేకాకుండా వేలకోట్ల విలువైన ఆర్టీసీ అవస్తులను ప్రైవేటు వాళ్లకి అమ్మేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైందన్నది తెలుస్తోంది.. ఇప్పటికే పురుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీకి చెందిన స్థలాన్ని ప్రైవేటు వాళ్లకి అతి తక్కువ ధరకు లీజుకు ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఆ విధంగా లీజుకు ఇచ్చినందుకు గాను ప్రభుత్వ పెద్దలకు భారీ ఎత్తున నజరానా కమిషన్లు దొరికాయి అన్నది విశ్లేషకుల వాదన. ఇక రాజకీయ గురువు అయిన చంద్రబాబు మార్గంలోనే ఇక్కడ శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా పయనిస్తున్నాడు అన్నది విశ్లేషకులు విమర్శిస్తున్నారు.. తెలంగాణలోని విలువైన ఆర్టీసీ ఆస్తులను సైతం ప్రైవేటు వారికి కట్టబెట్టి దానికి బదులుగా కమిషన్లు కొట్టేయాలన్నదే ప్రభుత్వ ఆలోచన అని మేధావులు విశ్లేషకులు బహిరంగంగానే విమర్శిస్తూ ఉన్నారు.. చార్జీల పెంపు అనే అంశాన్ని పునర్ ఆలోచించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని "ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ తీవ్రంగా హెచ్చరిస్తోంది"
ఛార్జీల పెంపుపై విపక్ష పార్టీలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ప్రభుత్వ వైఖరిని "ప్రజావ్యతిరేక నిర్ణయం"గా అభివర్ణిస్తూ, ఇది సామాన్యులపై ఆర్ధిక దాడిగా పేర్కొంటూ.. వెంటనే ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వివిధ ప్రాంతాల్లో ధర్నాలు, ర్యాలీలు నిర్వహించాయి.. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడం చూశాం..
సామాన్యుల వ్యథలు :
ప్రతిరోజూ ఆర్.టి.సీ బస్సులపై ఆధారపడే విద్యార్థులు, ఉద్యోగస్తులు, రైతులు, సామాన్య, నిరుపేద ప్రజలు వీరందరికీ ఈ ఛార్జీల పెంపు ఒక కొత్త భారంగా మారింది.
కొంతమంది ప్రజలు ఇప్పటికే ప్రయాణాలను తగ్గించుకునే స్థితికి దిగజారాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.. నిజంగా ఇది వాంఛనీయం కాదు.. పలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ రవాణా లేకపోవడం మరింత కష్టాలను పెంచుతోంది.
చిన్నదుకాణదారులు, చిరు వ్యాపారులు కూడా తమ వ్యాపారాలకు ఇది ప్రతికూల ప్రభావం చూపుతోందని వాపోతున్నారు.
ప్రభుత్వం వాదన :
దీన్ని సమర్థించుకుంటూ ప్రభుత్వం ఏమి చెబుతోంది అంటే..ఇంధన ధరలు పెరగడం, నిర్వహణ ఖర్చులు అధికమవడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు..బస్సు సేవలను నిలకడగా కొనసాగించేందుకు ఇది తప్పనిసరి అయిందని అంటోంది.
అయితే, కొంతమందికి కాంపెన్సేషన్ విధానాలపై పరిశీలన జరుగుతోందని కూడా తెలిపింది. అయితే విశ్లేషకుల వాదన మరోలా ఉంది.. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఎవరు అడిగారని వాళ్లు ప్రశ్నిస్తూ ఉన్నారు.. మీ రాజకీయ లబ్దికోసం పనికిరాని పథకాలు పెడుతూ దానిపై వచ్చే నష్టాలను తిరిగి ప్రజల మీదే రుద్దడం ఎంతవరకు సమంజసం అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
మరికొందరు మేధావులు విశ్లేషకులు మరో భయంకర వాస్తవాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు ఏమిటంటే.. ఆర్టీసీపై ప్రజలకు అసహ్యం కలిగేలా చేసి ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి భయంకరమైన కుట్రలు చేస్తున్నారు అని అంటున్నారు.. ఇక అదే విధంగా వేలకోట్ల రూపాయల విలువచేసే ఆర్టీసీ ఆస్తులను తమ వాళ్లకి కట్టబెట్టడానికి మరో ఎత్తు వేస్తున్నారని వారు అంటున్నారు.. ఇది ఎంత మాత్రం వాంఛనీయం కాదంటూ వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు.. ప్రజల ఆస్తులను అమ్మటానికి ప్రభుత్వానికి ఏమి హక్కు ఉంది అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు.. ప్రజావసరాలకు ఉపయోగపడవలసిన ప్రభుత్వ ఆస్తులను అమ్మటం సరికాదు అంటున్నారు వాళ్లు.. తక్షణమే చార్జీల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వీలైతే మరింతగా చార్జీలను తగ్గించి సామాన్యులకు భారం లేకుండా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు...
కాగా ఇది ఇలా ఉండగా భారత శక్తి దినపత్రిక ముందుగానే హెచ్చరించింది ప్రైవేట్ ట్రావెల్స్ వారికి లబ్ది చేకూరే లాగా ప్రభుత్వా నిర్ణయాలు ఉన్నాయని ఆర్టీసీకి సంబంధించిన వేలకోట్ల విలువైన ఆస్తులను కైంకర్యం చేయడానికి కుట్రలు పన్నుతున్నారని హెచ్చరించింది.. ఇప్పుడు భారత శక్తి దినపత్రిక చెప్పిన విధంగా జరగబోతోందా అన్న అనుమానాలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి దీనికి రేవంత్ ప్రభుత్వమే సమాధానం చెప్పాలి..
ఇక చివరగా ఛార్జీల పెంపు నెపంతో ఆందోళనలు కొనసాగుతున్న ఈ సమయంలో, ప్రజల అభిప్రాయాలను పట్టించుకుని, ఒక సమతుల్య పరిష్కారం వైపు ప్రభుత్వం అడుగులు వేయాలన్నది సామాన్యుల ఆకాంక్ష. ప్రజాప్రయోజనాల దృష్ట్యా, ఈ సమస్యపై త్వరితగతిన స్పష్టత రావాల్సిన అవసరం ఉందని ఆశిస్తోంది " ఫోరం ఫర్ యాంటీ కరప్షన్ అండ్ హ్యూమన్ రైట్స్ సంస్థ "..