తాడ్వాయి మండలంలో అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్..
కామారెడ్డి :
- ఎటిసి ను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్..
గురువారం జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్నటువంటి అడ్వాన్సుడ్ టెక్నాలజీ సెంటర్- ఎటిసి ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సందర్శించి ఎటిసిలో ఉన్నటువంటి అధునాతనమైన మిషన్స్ యొక్క పనితీరు గురించి తెలుసుకోవడం జరిగింది. తదనంతరం విద్యార్థులతో ట్రైనింగ్ ఎలా జరుగుతుందనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. అధునాతనమైన నైపుణ్యాలను ప్రతి ఒక్క విద్యార్థి అందిపుచ్చుకొని భవిష్యత్తులో అత్యున్నతమైన స్థాయికి చేరుకోవాలని విద్యార్థులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాడ్వాయి ఐటిఐ/ఎటిసి ప్రిన్సిపల్(ఎఫ్ఎసి) జి కనకయ్య, ఎటిసి ఇన్చార్జి రమేష్, సిబ్బంది వెంకటరమణ, అరవింద్, తదితరులు పాల్గొన్నారు.
About The Author
18 Oct 2025