నేటి భారతం :

download

రాజకీయాలు ప్రజాసేవగా మొదలై..  
వ్యక్తిసేవగా మారినప్పుడు కుతంత్రాలు మొదలవుతాయి.
కుర్చీ కోసం కుదురులేని వాళ్లే దేశాన్ని కుదిపేస్తారు.
నాయకత్వం అంటే నడిపించడం కాదు..  
నిజాయితీగా నిలబడటం.
ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చి..  
ప్రజల హక్కులకు భంగం కలిగించినప్పుడు..  
రాజకీయాలు కుళ్ళిపోతాయి.
కుళ్ళు రాజకీయాలు విత్తనమైతే..  
ప్రజల నిర్లక్ష్యమే ఎరువుగా మారుతుంది.. 
అధికారంలోకి రావడమే లక్ష్యమైతే..  
ఆ రాజకీయం సేవ కాదు.. వ్యాపారం మాత్రమే.. 
కుళ్ళు రాజకీయాలు దేశ భవిష్యత్తును తినే 
కనిపించని విష కీటకాలు... 
ధనం కోసం చేసే రాజకీయం.. 
ధర్మం కోల్పోయిన రాజకీయం అవుతుంది.. 
ప్రజల బాధలను మరచి పార్టీ ప్రయోజనాలకే 
కట్టుబడే నాయకుడు, దేశానికి భారమే.. 
నాయకులు మారుతున్నారు.. 
కానీ కుళ్ళు రాజకీయాల మూలాలు మారడం లేదు.
నిజానికి ఓటు వేసే చేతులు మారితేనే, 
రాజకీయాలు సమూలంగా మారతాయి.
ఈ నిజాన్ని అందరూ గమనించాలి.. 

Read More పాండవుల గుహలను సందర్శించిన వరల్డ్ హెరిటేజ్ వాలంటీర్స్

About The Author